ట్విటర్ లో ఆ హీరోయిన్ ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ఎవరంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈయన తన సినీ కెరియర్ లో నటించిన చిత్రాలలో వరుడు(Varudu) సినిమా ఒకటి.

 Who Is Allu Arjun Who Blocked That Heroine On Twitter, Varudu, Twitter, Bhanu Sr-TeluguStop.com

గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల పెళ్లి అంటూ ఈ సినిమాలో పెళ్లికూతురుని చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమా ప్రభావం మాత్రం ప్రేక్షకులపై చాలా పడిందని చెప్పాలి.

ఈ సినిమా తర్వాత ఐదు రోజుల పాటు పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు భాను శ్రీ మెహ్రా(Bhanu Sri Mehra).

వరుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది.దీంతో హీరోయిన్ గా మాత్రమే కాకుండా సహాయ నటి పాత్రలలో కూడా నటించి సందడి చేశారు.అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తనని ట్విట్టర్( Twitter) లో బ్లాక్ చేశారంటూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేస్తూ తాను అల్లు అర్జున్ తో కలిసి వరుడు సినిమాలో నటించానని తెలిపారు.

ఈ సినిమా పెద్దగా కలిసి రాకపోయినా నా ప్రయత్నాలను మాత్రం ఆపలేదు.కానీ ఇక్కడ చూడండి బన్నీ ట్విట్టర్లో బ్లాక్ చేశారంటూ ఈమె చెప్పుకొచ్చారు.

ఇలా ఈ పోస్ట్ చేసినటువంటి రెండు గంటలకి ఈమె మరొక పోస్ట్ చేస్తూ… గ్రేట్ న్యూస్ అల్లు అర్జున్ తనని అన్ బ్లాక్ చేశారని.నేను ఎప్పుడూ ఆయనని నిందించలేదు అంటూ ఈమె మరొక పోస్ట్ చేశారు.ఇలా రెండు గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ ఈమెను బ్లాక్ చేసే తిరిగి అన్ బ్లాక్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.అయితే అల్లు అర్జున్ మాత్రం తనని బ్లాక్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం మాత్రం తెలియడం లేదు.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2)సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube