తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో విమర్శలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.ప్రధాన పార్టీలన్నీ విజయమే లక్ష్యంగా ఉండడంతో ప్రతి పార్టీ కూడా ప్రత్యర్థి పార్టీక్జి చెక్ పెట్టె విధంగానే వ్యూహాలు రచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ( BRS Congress BJP ) మద్య బీటీం గోల రోజురోజుకు పెరుగుతోంది.కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలని ఆ రెండు పార్టీలు ఒకదానికొకటి బీటీంగా పని చేస్తున్నాయని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.
అటు కాంగ్రెసేమో బీజేపీకి బిఆర్‌ఎస్ బీటీం గా పనిచేస్తోందని విమర్శలు గుప్పిస్తోంది.ఇటు బీజేపీ కూడా అదే విధంగా బిఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని చెబుతోంది.

ఇలా మూడు ప్రధాన పార్టీలు కూడా ట్రాయాంగిల్ స్టోరీ నడుపుతున్నాయి.ఇంతకీ ఈ విమర్శల్లో నిజమెంత అనేది ప్రజల్లో అతిపెద్ద క్వశ్చన్.తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ( Rahul Gandhi )మాట్లాడుతూ బిఆర్‌ఎస్ బీజేపీ ఒక్కటే అనే విధంగా వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్ నుంచి గట్టి సమాధానలే వస్తున్నాయి.
నిజంగా బీజేపీకి బిఆర్‌ఎస్ బీ టీం గా ఉంటే రాష్ట్రంలో బీజేపీ ఎందుకు బలహీనంగా ఉందనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.అలాగే రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ ( Sonia Gandhi )పై నమోదైన నేషనల్ హెరాల్డ్ కేసు ఏమైందని, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలపై ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదని, ఈ పరిణామాలను బట్టి చూస్తే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయని అర్థమౌతోంది కదా అంటూ బిఆర్‌ఎస్( BRS ) శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరి ఈ రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ప్రజల్లో కూడా అర్థం కానీ పరిస్థితులు నెలకొంటున్నాయి.అయితే ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలే అని కొందరు కొట్టిపారేస్తున్నారు.ఎవరికి ఎవరు బీటీం గా పని చేయరాని పరిస్థితులకు తగ్గట్లుగా ఒక పార్టీకి మరో పార్టీకి మద్య అంతర్గత ఒప్పందాలు తప్పక ఉంటాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.అయితే రాజకీయ పార్టీల జిమ్మీక్కులు ప్రజలకు తెలియనివి కాదు.ఎవరెన్ని విమర్శలు చేసిన ప్రజలు వారి అభిప్రాయాలకు తగినట్లుగానే ఓట్లు వేసి అధికారం కట్టబెడతారని విశ్లేషకులు చెబుతున్నా మాట.మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.