అసంతృప్తులు ఎవరెవరు ? ఏ ఏ పార్టీలో చేరుతున్నారు ? 

ఎన్నికల సమయంలో అసంతృప్తులు, అలకలు, గ్రూపు రాజకీయాలు , వలసలు ఇవన్నీ సర్వసాధారణమైన అంశాలు.ఒక పార్టీ నుంచి టికెట్ ఆశించిన నేతలు తమకు టిక్కెట్ దక్కకపోతే వేరే పార్టీలో చేరడం సర్వసాధారణమే.

 Who Are The Dissatisfied Which Party Are You Joining , Bjp, Telangana, Brs, Cong-TeluguStop.com

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు( elections in Telangana) సమయం మూడు నెలలు ఉండగానే, ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి కెసిఆర్ ( KCR )సంచలనానికి తెర లేపారు.పార్టీ టికెట్ ఆశించి దక్కని వారు వసంతృప్తికి గురై వేరే పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ లో గందరగోళం నెలకొంది.గతంలో తమకు టిక్కెట్ హామీ ఇచ్చి ఇప్పుడు జాబితాలో తమ పేరు లేకుండా చేశారని చాలామంది సీనియర్ నేతలు అసంతృప్తి గురవడం, వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయడం వంటివి చోటు చేసుకున్నాయి.

 బిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ సైతం అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.ఈ విషయంలో కాస్త వెనకబడ్డ బిజెపి( BJP ) కూడా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

ఇది ఇలా ఉంటే .అధికార పార్టీ బీఆర్ఎస్ లో మాత్రం అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ముఖ్యంగా అంబర్  పేట నియోజకవర్గ టికెట్ పై ఆశలు పెట్టుకున్న కృష్ణ యాదవ్( Krishna Yadav ) టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురై,  పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆత్మగౌరవం లేని పార్టీ అని , బీసీలకు వ్యతిరేక పార్టీ అని , తనకు అంబర్ పేట టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ ఇవ్వలేదని కృష్ణ యాదవ్ సంచలన విమర్శలు చేశారు.

కేసిఆర్ గతంలో తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ హామీ నిలబెట్టుకోలేదని కృష్ణ యాదవ్ మండిపడ్డారు.

Telugu Asembly Tiket, Congress, Krishna Yadav, Telangana-Politics

త్వరలోనే ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .కృష్ణ యాదవ్ బిజెపిలో చేరినా,  ఆయనకు అంబర్ పేట టికెట్ ( Amber Peta ticket )ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.ఎందుకంటే అక్కడ నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణ యాదవ్ పార్టీలో చేరితే ఆయనకు ఏ హామీ ఇస్తారు అనేది తేలాల్సి ఉంది.కృష్ణ యాదవ్ తో పాటు , మరికొంతమంది కీలక నేతలు బి.

ఆర్.ఎస్ ( B.R.S )ను వీడెందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనకు మల్కాజ్ గిరి టికెట్ తో పాటు, తన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ కేటాయించాలని గత కొద్దిరోజులుగా హడావిడి చేస్తున్నారు.ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది .వారం రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని ప్రకటించారు.

Telugu Asembly Tiket, Congress, Krishna Yadav, Telangana-Politics

ఇదే విధంగా మహేశ్వరం నియోజకవర్గం టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న తీగల కృష్ణారెడ్డి,  ఎల్బీనగర్ నుంచి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ వంటి వారు అసంతృప్తితోనే ఉన్నారు .ఇక ఉప్పల్ సీటును ఆశించిన నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.బీ ఆర్ ఎస్ పరిస్థితి ఇలా ఉంటే…  కాంగ్రెస్ ,బీజేపీలు టికెట్ ప్రకటన చేసిన తర్వాత ఆ రెండు పార్టీల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube