Minister Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం

తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.ఈ మేరకు సభలో శ్వేతపత్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) ప్రవేశపెట్టారు.

 White Paper On Irrigation In Telangana Assembly-TeluguStop.com

ఇరిగేషన్ శాఖలో( Irrigation Department ) అన్ని విషయాలను వెల్లడిస్తూ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కీలకమని చెప్పారు.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని మేడిగడ్డ కట్టారన్న మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ బ్యారేజ్ దారుణంగా దెబ్బతిందని చెప్పారు.

వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్ మూడేళ్లకే దెబ్బతిందని పేర్కొన్నారు.

నాణ్యతా లోపంతోనే బ్యారేజ్ కుంగిపోయిందని తెలిపారు.గత ప్రభుత్వలో ఇరిగేషన్ రంగంలో భారీ అవినీతి జరిగిందన్నారు.రూ.1800 కోట్లతో మేడిగడ్డను( Medigadda Barrage ) డిజైన్ చేశారని, అంచనా వ్యయం రూ.4500 కోట్లకు పెరిగిందన్నారు.బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు.

అంతేకాకుండా అన్నారంలో కూడా లీకేజీ మొదలైందని చెప్పారు.ప్రస్తుతం అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందన్న మంత్రి ఉత్తమ్ రిజర్వాయర్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు.అన్నారం బ్యారేజ్( Annaram Barrage ) నుంచి నీటిని తొలగించాలని ఎన్డీఎస్ఏ పేర్కొందని చెప్పారు.ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) నిరుపయోగమని స్పష్టం చేశారు.

అదేవిధంగా కాగ్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube