కొన్ని నెలల గ్యాప్ లోనే పుష్ప2, గేమ్ ఛేంజర్, దేవర( Pushpa2, Game Changer, Devara ) పోస్టర్లు రిలీజ్ అయ్యాయనే సంగతి తెలిసిందే.ఈ మూడు సినిమాల పోస్టర్లు ఆయా హీరోల అభిమానులకు తెగ నచ్చేశాయి.
ఈ మూడు సినిమాల బడ్జెట్లు ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే.అయితే ఈ మూడు పోస్టర్లలో ఎక్కువగా ఆకట్టుకున్న పోస్టర్ ఏదనే ప్రశ్నకు ఎక్కువమంది పుష్ప2 పోస్టర్ అని సమాధానం ఇస్తుండటం గమనార్హం.
గేమ్ ఛేంజర్, దేవర పోస్టర్లలో ఏ పోస్టర్ ను తక్కువ చేయలేమని ఆయా సినిమాలకు అనుగుణంగా రెండు పోస్టర్లు బాగున్నాయని ఎక్కువమంది చెబుతున్నారు.పుష్ప2 పోస్టర్ లో బన్నీ గంగమ్మ గెటప్ ( Bunny Gangamma Getup )లో కనిపించడం అభిమానులకు ఒకింత షాకిచ్చిన సంగతి తెలిసిందే.అదే సమయంలో అభిమానులు సర్పైజ్ అయ్యారు.సినిమాలో ఈ పోస్టర్ తో ఉన్న సన్నివేశానికి అభిమానులకు పూనకాలు ఖాయమని చెప్పవచ్చు.

దేవర, గేమ్ ఛేంజర్ పోస్టర్లు బాగున్నాయని అయితే కొత్తదనం విషయంలో ఈ పోస్టర్లు పుష్ప2కు గట్టి పోటీ ఇవ్వలేకపోయాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.ఈ మూడు సినిమాల బడ్జెట్లు 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.

పుష్ప2 సినిమాకు సుకుమార్( Sukumar ) దర్శకుడు కాగా గేమ్ ఛేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు.దేవర సినిమాకు కొరటాల శివ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.ఈ మూడు సినిమాలు వేర్వేరు బ్యాక్ డ్రాప్ లలో, వేర్వేరు జానర్లలో తెరకెక్కుతున్నాయి.
ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఈ మూడు సినిమాలు మాస్ ప్రేక్షకులు టార్గెట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.2024 సమ్మర్ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







