హీరోయిన్ నభా నటేష్, అలాగే నిధి అగర్వాల్ ఇద్దరూ కూడా తెలుగు ఇండస్ట్రీకి ఒకే సమయంలో ఎంట్రీ ఇచ్చారు.సవ్యసాచి సినిమాతో నిధి అగర్వాల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, నన్ను దోచుకుందువటే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్.
సవ్యసాచి సినిమాతో నిధి అగర్వాల్ ఒక్కసారిగా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది.సవ్యసాచి సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయి అని అందరూ భావించారు.
ఇక సవ్యసాచి సినిమా తర్వాత తీసిన మిస్టర్ మజ్ను సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.
అయితే ఈ సినిమా సక్సెస్ ను సాధించలేకపోయినప్పటికీ ఏకంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే సినిమా చేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ.
ఇక నన్ను దోచుకుందువటే సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది నభా నటేష్.కాగా ఇద్దరు ముద్దుగుమ్మలో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకోవడంతోపాటు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.
అంతేకాకుండా ఇద్దరు కూడా మాస్ సాంగులతో రచ్చ రచ్చ చేశారు.అయితే వీరి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే వీరి ఖాతాల్లోకి భారీగా సినిమా అవకాశాలు వచ్చి చేరుతాయని అందరూ భావించారు.

ఇక వీరిద్దరిలో నిధి అగర్వాల్ విషయానికి వస్తే.ఈమె సినిమాల విషయంలో అంత స్పీడును చూపించలేకపోయింది.కోలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే తెలుగులో హీరో అనే సినిమాలో నటించింది.కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్లో పాల్గొంటూనే మరి కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఆమెకి పెద్దగా సక్సెస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి.

ఇకపోతే నభా నటేష్ విషయానికి వస్తే… ఈ ముద్దుగుమ్మ వరసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో లాంటి సినిమాలలో అవకాశాలను అందుకుంది.తర్వాత నభా నటేష్ కు సరైన అవకాశాలు లేక డీలా పడిపోయింది.
అలా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో బాగానే సందడి చేసిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఆ తర్వాత కనిపించకుండా పోయారు.







