రాంగోపాల్ వర్మ దర్శకత్వం వర్ధించిన శివ సినిమా ఘనవిజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తే రఘువరన్ జెడి చక్రవర్తులు నెగటివ్ పోషించారు.
ఇక ఈ సినిమాలో వీరే కాకుండా ఆ ప్రముఖ పాత్ర వహించింది సైకిల్ చైన్. నాగార్జున సైకిల్ చైన్ లాగి దానితో ఫైట్ చేసి అప్పట్లో ట్రెండ్ సృష్టించాడు.
అయితే ఈ సైకిల్ చైన్ పెట్టడం వెనక చాలా పెద్ద కథ ఉంది.
అలాగే ఈ సినిమా షూటింగ్ అయ్యాక ఆ సైకిల్ చైన్ ఎక్కడ ఉంది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హీరో నాగార్జున కి విలన్ జేడి కి మధ్య ఒక ఫైట్ పెట్టల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మొదట ఒక ఫుట్ బాల్ గ్రౌండ్లో ప్లాన్ చేయాలని అనుకున్నాడు వర్మ.కానీ నాగార్జున బ్రదర్ వెంకట్ ఒప్పుకోక పోవడం తో సైకిల్ చైన్ కాన్సెప్ట్ చెప్పాడట అందుకు వెంకట్ ఒప్పుకున్నాడు.
కానీ ఐడియా అయితే చెప్పాడు కానీ అసలు లాగితే సైకిల్ చైన్ తెగుతుందా లేదా అని ఇంటికి వెళ్లి ప్రయత్నిస్తే అస్సలు చైన్ తెగకపోగా, చెయ్యి విరిగిపోతుంది అని భయపడ్డాడట వర్మ.అయినా కూడా సినిమా లో పెట్టకుండా ఉండలేక పోయాడట.సినిమాలో సైకిల్ చైన్ కాన్సెప్ట్ ఇన్ని దశబ్దాల తర్వాత కూడా చాలా మంది వాడుతుండటం చూసి తను గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడట.ఇక ఈ సైకిల్ చైన్ షూటింగ్ లో వాడిన తర్వాత ఎక్కడ ఉంది అని చాలా మందికి అనుమానం ఉండచ్చు.
ఈ చైన్ ప్రస్తుతం తన కెరీర్ లో ఒక పెద్ద హిట్ ఇచ్చాడని జేడి చక్రవర్తి తన ఇంట్లో ఇప్పటికి ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాడు.ఇప్పటికీ అది ఆయన ఇంట్లోనే ఉంది.ఎన్నేళ్లు అయిన కూడా అది తనతోనే ఉంటుంది అని అందుకే శివ సినిమా అయిపోయాక ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి తెచ్చుకొని బద్రపరుచుకున్న అని ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడి చక్రవర్తి తెలిపారు.