అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ సూపర్ కేజ్ తెచ్చుకోగా ఆ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండే మాత్రం కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేకపోయింది.అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయినా కూడా అమ్మడికి స్టార్ అవకాశాలు రాలేదు.
వచ్చిన యువ హీరోల ఛాన్స్ లలో చేసినా వర్క్ అవుట్ కాలేదు.షాలిని పాండే తెలుగులోనే కాదు తమిళంలో కూడా తన లక్ టెస్ట్ చేసుకుంది.
హిందీలో కూడా అమ్మడు తన టాలెంట్ చూపించాలని చూసినా వర్క్ అవుట్ కాలేదు.
అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని అనుకోగా అమ్మడు మాత్రం అంత గొప్ప కెరీర్ ని సాగించలేదు.తెలుగులో అసలు ఆమెకు అవకాశాలు లేకపోగా ఇతర భాషల్లో కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్టు తెలుస్తుంది.మరి షాలిని తిరిగి ఫాం లోకి వచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా లేదా అన్నది చూడాలి.
తెలుగులో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ప్రయత్నించడం బెటర్ అని చెప్పొచ్చు.అమ్మడు ఇక్కడ చేయాలని చూస్తున్నా అవకాశం ఇచ్చే వారు మాత్రం లేరని తెలుస్తుంది.