తప్పెక్కడ జరిగింది ? ఫలితాల పై బీజేపీ సమీక్ష 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP )కి పెద్ద షాకే ఇచ్చాయి.కొద్ది నెలలు క్రితం వరకు ప్రధాన పోటీ అంతా బిజెపి బీఆర్ఎస్  మధ్యనే ఉంటుందని అంత భావించారు.

 Where Did It Go Wrong Bjp S Review Of The Results , Bjp, Telangana Bjp, Congres-TeluguStop.com

అయితే అనూహ్యంగా కాంగ్రెస్ బలం పుంజుకోవడం, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం , ఆ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ పైన పడటంతో ప్రజల దృష్టి కాంగ్రెస్ వైపు మళ్ళింది.దీంతో ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అన్నట్లుగా సాగింది .దీంతో బిజెపి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.బిజెపి అగ్ర నేతలు అంతా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఫలితం మాత్రం కనిపించలేదు.

దీంతో అసలు తప్పెక్కడ జరిగింది ఎందుకు ఓటమి చెందాము వంటి విషయాలపై సమీక్ష చేపట్టింది.సీట్ల కేటాయింపు నుంచి ఫలితాలు ప్రకటన వరకు అభ్యర్థుల తీరుపై పూర్తిస్థాయిలో నివేదికతో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ).దీంతో  ఈ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి బిజెపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

Telugu Amith Shah, Brs, Congress, Jp Nadda, Kishan Reddy, Telangana Bjp, Telanga

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు దక్కాయి.14% ఓట్లు సాధించింది.అయితే చాలా తక్కువ సీట్లు రావడం , గత మూడేళ్లు బిజెపి పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టినా,  ప్రజల్లోకి వెళ్లినా ఎందుకు బలపడలేక పోయింది ? ఇన్ని తక్కువ సీట్లు ఎందుకు దక్కాయి అనే విషయాల పైన అంతర్గతంగా పార్టీ నేతలు మధ్య చర్చ జరుగుతోంది.ఇప్పటికే పార్టీ వైఫల్యాలపై కిషన్ రెడ్డి పూర్తిస్థాయిలో నివేదికను రూపొందించారు.ఢిల్లీకి వెళ్లిన కేషన్ రెడ్డి ఆ నివేదికను బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు సమర్పించనున్నారు.

అయితే కిషన్ రెడ్డి తీసుకువెళ్ళిన రిపోర్టులో ఏముంది ?  ఎవరెవరిపై ఫిర్యాదులు చేశారనే విషయం పై ఆసక్తి నెలకొంది.ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి ముందు నుంచి చాలా వ్యూహాలను అమలు చేసింది.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం తో పాటు,  బీసీ సీఎం నినాదం ఎత్తుకున్నా ఫలితం దక్కకపోవడంపై విశ్లేషణ చేసుకుంటుంది.

Telugu Amith Shah, Brs, Congress, Jp Nadda, Kishan Reddy, Telangana Bjp, Telanga

 బిజెపి 36 మంది బీసీలకు టికెట్లు ఇస్తే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు .అలాగే 12 మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఒక్కరు కూడా గెలుపొందలేదు.అలాగే ఎస్సీ , ఎస్టీ రిజర్వ్ సీట్ల పైన మిషన్ 31 అని కమిటీలు వేసినా ఒక్క స్థానంలో కూడా గెలవలేదు .ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్,  ఆదిలాబాద్ జిల్లాల్లో ఆరు స్థానాలు మాత్రమే దక్కాయి.గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపికి 48 మంది కార్పొరేటర్లు,  టీచర్స్ ఎమ్మెల్సీలు ఉన్నా,  వారి సేవలను వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .జిహెచ్ఎంసి పరిధిలో కేవలం గోషామహల్ లో మాత్రమే బిజెపి అభ్యర్థి రాజాసింగ్ ( Raja Singh )సాధించారు.ఇక కరీంనగర్,  హుజూరాబాద్ , కోరుట్ల , బోధ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కచ్చితంగా బిజెపి అభ్యర్థులు గెలుస్తారని ఆ పార్టీ అంచనా వేసింది.

కానీ ఆ స్థానాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు , ఎంపీలు పోటీ చేసినా ఓటమి ఎదురవడం తో బిజెపి డిలా పడుతోంది.ప్రస్తుతం కిషన్ రెడ్డి దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయడంతో దీనిపై అధిష్టానం ఏ చర్యలు తీసుకుంటుంది,  రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపిని ఏ విధంగా బలోపేతం చేస్తుందని విషయంపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube