ఈ ఐపీఎల్ సీజన్ ఎక్కడ, ఎలా మొదలైందో.. అక్కడే, అలాగే ముగియనుంది..!

ఐపీఎల్ సీజన్( IPL Season ) ప్రస్తుతం తుది దశలో ఉంది.మే 28 ఆదివారం అహ్మదాబాద్ ( Ahmedabad )లోని నరేంద్ర మోడీ స్టేడియం( Narendra Modi stadium ) వేదికగా గుజరాత్-చెన్నై( GT vs CSK ) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 Where And How This Ipl Season Started Is Going To End The Same Way Details, Ipl2-TeluguStop.com

అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో సరికొత్త ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

ఈ ఐపీఎల్ సీజన్ ఎక్కడ, ఎలా మొదలైందో.

అక్కడే, అలాగే ముగియనుంది.ఈ ఐపీఎల్ సీజన్-16 మార్చి 31న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్- చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ తో మొదలైంది.

Telugu Ahmedabad, Gt Csk Final, Iplplayoff, Ipl Latest, Ipl Latedst, Latest Telu

తర్వాత పది జట్ల మధ్య 57 రోజులలో 73 మ్యాచ్లు పూర్తయ్యాయి.చెన్నై, గుజరాత్ జట్లు ఫైనల్ కు చేరాయి.అంటే ఈ ఐపీఎల్ సీజన్ ఎక్కడ ఏ జట్లతో మొదలైందో.అక్కడే ఆ జట్లతోనే ముగియనుంది.ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా( Aakash chopra ) ట్విట్టర్ లో విషయాన్ని షేర్ చేయడంతో, ఈ న్యూస్ వైరల్ అయింది.ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సీజన్ తొలి మ్యాచ్లో గుజరాత్ గెలిచింది కదా.మళ్లీ గుజరాత్ గెలుస్తుందా లేదంటే సీన్ రివర్స్ అయ్యి చెన్నై గెలుస్తుందా అంటూ క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.కొందరేమో క్వాలిఫైయర్-1 మ్యాచ్లో చెన్నై గెలిచింది కదా.ఏ జట్టు గెలుస్తుందో ముందుగా ఊహించడం కష్టమే అంటున్నారు.ఎందుకంటే సీజన్ తొలి మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే.క్వాలిఫైయర్-1 మ్యాచ్లో చెన్నై గెలిచింది.

Telugu Ahmedabad, Gt Csk Final, Iplplayoff, Ipl Latest, Ipl Latedst, Latest Telu

ఇక క్వాలిఫైయర్-2 లో గుజరాత్ జట్టు ఓపెనర్ గిల్ శతకంతో జట్టును ఆదుకుంటే.గుజరాత్ జట్టు బౌలర్ మోహిత్ శర్మ ఏకంగా ఐదు వికెట్లు తీసి ముంబై బౌలర్లను కట్టడి చేశాడు.వీరికి మహమ్మద్ షమీప్ తీసిన రెండు కీలక వికెట్లు తోడవడంతో గుజరాత్ ఘనవిజయం సాధించి ఫైనల్ కు చేరింది.మరి ఫైనల్ లో చెన్నై జట్టుపై ఈ ఆటగాళ్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube