కెనడాలో ( Canada ) దారుణం జరిగింది.భర్త చేతిలో భారతీయ మహిళ హత్యకు గురైంది.
వివరాల్లోకి వెళితే.మృతురాలిని బ్రాంప్టన్‌కు ( Brampton ) చెందిన దేవిందర్ కౌర్‌గా( Davinder Kaur ) గుర్తించారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పీల్ రీజనల్ పోలీసులకు ఓ మహిళ కత్తిపోటు గాయాలతో పడివుందంటూ 911కి కాల్ వచ్చింది.ఆమె ప్రాణాలను నిలబెట్టేందుకు పారా మెడిక్స్ తీవ్రంగా ప్రయత్నించారు.
అయితే తీవ్రగాయాలతో దేవిందర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఘటనాస్థలికి రెండు కిలోమీటర్ల దూరంలోనే నవ్ నిషాన్ సింగ్‌ను( Nav Nishan Singh ) పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి నిందితుడు , బాధితురాలి భర్త అయిన 44 ఏళ్ల నవ్ నిషాన్ సింగ్‌పై ఫస్ట్ డిగ్రీ హత్యకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు.అనంతరం శనివారం బ్రాంప్టన్ కోర్టులో అతనిని హాజరుపరిచారు.
దేవిందర్ కౌర్ (43)ను చెర్రీట్రీ డ్రైవ్ అండ్ స్పారో కోర్ట్ సమీపంలో స్పారో పార్క్ వద్ద నిందితుడు కత్తితో పొడిచాడు.అమెరికాలో నివసిస్తున్న దేవిందర్ కౌర్ సోదరుడు లఖ్వీందర్ సింగ్ ప్రకారం.

కౌర్ తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని యోచిస్తోంది.తన సోదరిని వదిలేసి నవ్ నిషాన్ సింగ్ ఆరు నెలల క్రితమే వెళ్లిపోయాడని లఖ్వీందర్ చెప్పారు.వీరిద్దరికి 20 ఏళ్ల క్రితం పెళ్లయ్యిందని, నలుగురు పిల్లలు కూడా వున్నారని.వీరిలో ముగ్గురు బ్రాంప్టన్‌లో, మరొకరు భారత్‌లో నివసిస్తున్నారని ఆయన తెలిపారు.మరోవైపు.దేవిందర్ కౌర్‌ను హత్య చేయడానికి దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇకపోతే.ఈ ఏడాది మార్చిలో వాంకోవర్ స్టార్‌బర్స్ కేఫ్ వెలుపల కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది.37 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో హత్య చేశాడు.ఘటనాస్థలంలోనే నిందితుడు 32 ఏళ్ల ఇంద్రదీప్ సింగ్ గోసల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటనకు ముందు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.ఈ క్రమంలోనే అది హత్యకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.







