యూట్యూబ్ తరహా ఫీచర్ త్వరలోనే వాట్సప్ లోకి( Whatsapp ) అందుబాటులోకి రానుంది.వాట్సాప్ లో వీడియోలను మరింత సౌకర్యవంతంగా చూసేందుకు వీలుగా వాట్సాప్ మరో అడుగు ముందుకు వేసింది.
ఇకపై వాట్సాప్ వీడియోను( Whatsapp Video ) ముందుకు, వెనక్కి కదిలించవచ్చు.ఈ ఫీచర్ ఇప్పటికే యూట్యూబ్ లో( Youtube ) అందుబాటులో ఉంది.
ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది.ఈ ఫీచర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది.
ప్రస్తుతం వాట్సాప్ లో ఉండే ఫీచర్ కు, త్వరలో అందుబాటులోకి వచ్చే ఫీచర్ కు చాలా వ్యత్యాసం ఉంటుందని, మునపటి కంటే మరింత సౌకర్యవంతంగా వీడియోలు చూసేందుకు అనుమతి ఇస్తుందని వాట్సప్ పేర్కొంది.ప్రస్తుతం టెస్టింగ్ లో ఉండే ఈ ఫీచర్ ముందుగా బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చి ఆ తర్వాత వాట్సప్ ఉపయోగించే వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.ఈ రాబోయే సరికొత్త ఫీచర్ కంటెంట్ నావిగేషన్ ను కూడా మెరుగు పరుస్తుంది.
సైబర్ నేరగాళ్ల బారిన వాట్సప్ వినియోగదారులు పడకుండా ఉండడం కోసం, వాట్సప్ లో లాక్ చేసిన చాట్( Chat Lock ) మరింత గోప్యంగా ఉండేందుకు వాట్సప్ అందుకు తగ్గ చర్యలు తీసుకుంటుంది.ఇందుకోసం ప్రత్యేకంగా సీక్రెట్ కోడ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సమాచారం.ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.
త్వరలో అందుబాటులోకి రానుంది.వాట్సప్ యూజర్ల కోసం మరో మెరుగైన ఫీచర్ ను వాట్సాప్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
ఈ వాట్సప్ స్క్రీన్ లాక్ ఫీచర్ తో వెబ్ లో లాక్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్ కూడా యూజర్లకు చాలా భద్రత కల్పిస్తుంది.