యూజర్లు ఛాటింగ్ కోసం వాట్సప్ యాప్‌ని ఉపయోగిస్తారనే విషయం తెలిసినదే.ఇపుడు ప్రపంచంలో వాట్సప్ అంటే ఏమిటో తెలియని మనుషులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.
అంతమందిని అలరిస్తుంది కనుకే, వాట్సాప్ సోషల్ మీడియా యాప్స్ లలో టాప్ స్థానాన్ని దక్కించుకుంది.తన యూజర్ల దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ నిత్యం ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది.
మనలో ఎవరన్నా ఎవరితోనైనా ఛాట్ చేయాలంటే వెంటనే వాట్సప్ ఓపెన్ చేసి ఛాటింగ్ చేయాల్సిందే.అంతలాగ ఇది జనాలను ఆకర్శించింది.
ఇకపోతే, త్వరలో మీకు వాట్సప్ నుంచి కూడా మెసేజెస్ రానున్నాయి.వాట్సప్ త్వరలో అఫీషియల్ ఛాట్ ఏర్పాటు చేయనుంది.WABetaInfo సమాచారం ప్రకారం, ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.అనేక సంస్థలు వెరిఫైడ్ ఛాట్స్ ద్వారా యూజర్లకు, కస్టమర్లకు సేవలు అందిస్తూ ఉంటాయి.
ఈ క్రమంలోనే వాట్సప్ కూడా వెరిఫైడ్ ఛాట్ తీసుకొస్తోంది.దీని వలన ప్రైవసీ, సేఫ్టీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
అంటే వాట్సప్ ఏ ఫీచర్ రిలీజ్ చేయబోతోందో నేరుగా యూజర్లకు ఈ ఛాట్ ద్వారా మెసేజ్ చేస్తుంది.

అయితే ఇక్కడ యూజర్లు ఓ విషయాన్ని గమనించుకోవాలి.ఈ ఛాట్‌లో యూజర్లు రిప్లై ఇవ్వడానికి, మెసేజెస్ చేయడానికి మాత్రం అవకాశం ఉండదు.ఇది రీడ్ ఓన్లీ అకౌంట్ మాత్రమే అని తెలుసుకోవాలి.
అంటే నోటిఫికేషన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.వాట్సప్ నుంచి కొత్తగా రాబోయే అప్‌డేట్స్, కొత్త ఫీచర్స్ గురించి ఇక్కడ సమాచారం అందుబాటులో ఉంటుంది అన్నమాట.
ఇప్పటికే టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్‌లో ఈ ఫీచర్ వున్న సంగతి తెలిసినదే.ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది కాబట్టి యూజర్లకు ఎప్పుడు రిలీజ్ అవుతుందనే సమాచారం ఇంకా తెలియాల్సి వుంది.