వాట్స్ అప్( Whatsapp ) గత కొన్ని సంవత్సరాలుగా వరుస అప్డేట్ లతో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోంది.వాట్సప్ తాజాగా సైడ్ బై సైడ్( Side-By-Side ) సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే వాట్స్ అప్ ఇంటర్ఫేస్ పై కంట్రోల్ ను మెరుగుపరుస్తుంది.ఈ ఫీచర్ ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.
ఈ కొత్త ఫీచర్ తో పాత చాట్ ను కంటిన్యూ చేస్తూనే కన్వర్జేషన్ మధ్య స్విచ్ అయ్యే అవకాశం కల్పిస్తుంది.వినియోగదారులు ఆండ్రాయిడ్ 2.23.9.20 అప్డేట్ కోసం తాజా వాట్స్అప్ బీటాను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ను పొందవచ్చు.దీనికి సంబంధించిన ఆప్షన్ సెట్టింగ్స్ లలో పొందుపరచడం జరిగింది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.

ముందుగా వాట్స్ అప్ సెట్టింగ్ ఓపెన్ చేసి చాట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.అక్కడ సైడ్ బై సైడ్ ఆప్షన్ ను టోగుల్ చేయడం ద్వారా ఆఫ్ చేయవచ్చు.ఈ ఆప్షన్ తో వాట్సాప్ ఇంటర్ ఫేస్ పై నియంత్రణను ఇస్తుంది.
ఈ ఫీచర్ వ్యూ స్క్రీన్ స్ప్లిట్ చేస్తుంది.తద్వారా ప్రతి కన్వర్జేషన్ చిన్న ఏరియాలో కనిపిస్తుంది.

ఈ ఫీచర్ తో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు బెటర్ చాటింగ్ ఎక్స్ పీరియన్స్( Chatting Experience ) పొందవచ్చు.కానీ ట్రెడిషనల్ సింగిల్ విండో వ్యూని ఇష్టపడే వారికి ఈ సైడ్ బై సైడ్ వ్యూ కాస్త అసౌకర్యంగా ఉండవచ్చు.బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.ఇటీవలే వాట్సప్ అకౌంట్ ను మల్టిపుల్ డివైస్ తో ఉపయోగించే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది.మల్టిపుల్ డివైజ్ లాగిన్ ఫీచర్ ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫోన్లలో ఒకే వాట్సప్ అకౌంట్ ను ఉపయోగించవచ్చు.ఈ సరికొత్త ఫీచర్లను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి తీసుకురానుంది.
త్వరలోనే బెటర్ చాటింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు.







