మరో రెండు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్..

అత్యంత ప్రజాదారణ పొందిన మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి.వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.

 Whatsapp Has Introduced Two More New Features What's Up, New Features, New Upda-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ఫీచర్స్ ను పరిచయం చేసిన వాట్సాప్ ఇప్పుడు మరో రెండు ప్రైవసీ ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఫ్లాష్ కాల్స్, మెసేజ్ లెవెల్ రిపోర్టింగ్ అనే పేర్లతో రెండు సరికొత్త ఫీచర్లను వాట్సాప్ పరిచయం చేసింది.

ఈ రెండు ఫీచర్లు భారత యూజర్ల ప్రైవసీకి రక్షాకవచంలా పని చేస్తాయి.మరి ఈ ఫీచర్స్ ఎలా పని చేస్తాయో తెలుసుకుందామా.

వాట్సాప్ రిజిస్ట్రేషన్ సమయంలో మనకు ఇప్పటిదాకా కేవలం ఎస్ఎంఎస్ వెరిఫికేషన్‌ వస్తుంది.అయితే ఇప్పుడు దానితో పాటు అదనంగా ఫ్లాష్ కాల్ ఫీచర్ కూడా యాడ్ అయింది అన్నమాట.

మామూలుగా కొత్త మొబైల్ ఫోన్ లో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీ ఫోన్ నంబర్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది.అయితే ఇలాంటి ఎస్ఎంఎస్ ల వల్ల యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.

కాబట్టి ఫ్లాష్ కాల్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది.అంటే రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్లాష్ కాల్ రూపంలో వెరిఫికేషన్ పూర్తవుతుంది.

ఫలితంగా యూజర్ల అకౌంట్ భద్రంగా ఉంటుంది.

Telugu Flash, Ups, Whats-Latest News - Telugu

రెండో ఫీచర్ మెసేజ్ లెవెల్ రిపోర్టింగ్ విషయానికొస్తే.ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే మీకు ఎవరైనా అసభ్యకర, హానికరమైన మెసేజ్‌లు పంపితే వాటిని వెంటనే మీరు రిపోర్ట్ చేయవచ్చు.ఆ యూజర్లను రిపోర్ట్ లేదా బ్లాక్ చేయడానికి లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

అలా యూజర్లు రిపోర్ట్ చేసే ఖాతాలను వాట్సాప్ ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించి ట్రేస్ చేసి వాటిని బ్యాన్ చేస్తుంది.ఈ రెండు రకాల ఫీచర్స్ తో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఢోకా ఉండదు అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube