అవును, మీరు విన్నది నిజమే.వాట్సాప్( Whatsapp ) లో త్వరలో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.
ఈమధ్య కాలంలో వాట్సాప్ స్పీడు మామ్ములుగా లేదు.ఇటీవల మెసేజ్ ఎడిట్, చాట్ లాక్ వంటి అద్భుత ఫీచర్లు ప్రకటించిన సంస్థ త్వరలో వీడియో కాలింగ్‌లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్‌ను సైతం తీసుకురాబోతుండడం గమనార్హం.
జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్‌లో వీడియో కాల్స్ చేసేటప్పుడు స్క్రీన్ షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.ఇదే ఆప్షన్‌ను ఇపుడు వాట్సాప్ తీసుకొస్తోంది.
ప్రస్తుతం బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.త్వరలో అందరి యూజర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.

ఈ ఆప్షన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎవరితోనైనా మీరు వీడియో కాల్ చేసినపుడు మన మొబైల్ స్క్రీన్‌ను అవతలి వ్యక్తులకు షేర్ చేసుకోవచ్చు.వాట్సాప్ సైతం ఇదే ఫీచర్‌ను తన యాప్‌లో తీసుకురానుండడం విశేషం.ఇందుకోసం స్క్రీన్ అడుగు భాగంలో కొత్తగా స్క్రీన్ షేరింగ్( Screen Sharing ) బటన్‌ను వాట్సాప్ ఇస్తోంది.ఈ బటన్‌ను క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో చేసే ప్రతిదీ రికార్డు అవ్వడంతో పాటు అవతలి వ్యక్తికి షేర్ కూడా అవుతుంది.
అయితే దీనికి యూజర్ అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలి.లేదంటే అవతలివాళ్ళు యాక్సెస్ చేయలేరు.

ఇక పాత ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్న ఫోన్ల విషయానికొస్తే పాత వాట్సాప్ వెర్షన్ లో ఈ ఫీచర్ వర్క్ చేస్తుందని చెప్పలేము.అలాగే ఎక్కువ సంఖ్యలో గ్రూప్ వీడియో కాలింగ్( Group Video Call ) మాట్లాడుతున్నప్పుడు కూడా స్క్రీన్ షేరింగ్ ఫీచర్ అనేది పనిచేయకపోవచ్చని సమాచారం.అయితే, బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ కొన్ని వారాల్లో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.అలాగే యూజర్లు ఇకపై తమ ఖాతాలకు యూజర్ నేమ్‌లు పెట్టుకునే సదుపాయాన్ని కూడా వాట్సాప్ ఇకనుండి కల్పించనుంది.
ప్రస్తుతానికి ఇది పరీక్షల దశలో ఉంది.