మేకప్ లేకపోతే మీరు ఇలా ఉంటారా? యాంకర్ అనసూయపై నెటిజన్స్ ట్రోల్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రోజురోజుకు తమ అందాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్నారు.

 What Would You Look Like Without Makeup Netizens Trolled Anchor Anasuya Anasuya,-TeluguStop.com

ఇక ముఖ్యంగా టాలీవుడ్ బుల్లితెర ఆర్టిస్టులు మాత్రం రోజురోజుకు తమ అందాల ఆరబోతతో ఫిదా చేస్తున్నారు.నిజానికి తమ మేకప్ అందాలతోనే అందర్నీ తమవైపు మలుపుకుంటున్నారు.

కానీ మేకప్ లేకుండా దర్శనమిస్తే మాత్రం వాళ్లని చూసి తట్టుకోలేకపోతున్నారు.అందులో ముఖ్యంగా యాంకర్ అనసూయను మాత్రం మేకప్ లేకుండా చూడలేరు తెలుగు ప్రేక్షకులు.

తెలుగు లో హాట్ యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే గ్లామర్ బ్యూటీ లిస్టులో చేరింది అనసూయ.గ్లామర్ హీరోయిన్లకు పోటీగా షో చేస్తూ అందరిని తన వైపు మలుపుకుంటుంది.

ఇక అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఆమె గ్లామర్ ను మరింత రెట్టింపు చేసుకుంది.లేటు వయసులో కూడా తన హాట్ అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.

ఇక ఈ హాట్ యాంకర్.మొదటిసారిగా వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో అడుగుపెట్టింది.ఆ తర్వాత తను జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టి అప్పటినుంచి అందరి దృష్టి తనపై పడేసుకునేలా చేసుకుంది.నిజానికి జబర్దస్త్ షోను కామెడీ కోసం కంటే ఎక్కువగా అనసూయ గ్లామర్ కోసం, తన డాన్స్ ల కోసం చూడటానికి ఇష్టపడతారు ప్రేక్షకులు.

ఇక ఈ క్రేజ్ తోనే ఆమె వెండితెరపై మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఓవర్ నైట్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

దీంతో అప్పటినుంచి వెండితెరపై కూడా వెనుతిరగకుండా వరుసగా చాలా సినిమాలలో అవకాశాలు అందుకుంది.కొన్ని సినిమాలలో మెయిన్ రోల్ కూడా చేసింది అనసూయ.

ఓ వైపు జబర్దస్త్ యాంకర్ గా ఉంటూనే మరోవైపు వెండితెరపై నటిగా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులల్లో కూడా చిందులేసింది.

ఇక ఇటీవలే పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి మరింత గుర్తింపు పొందింది.

ఇక ఇటీవలే అనసూయ జబర్దస్త్ నుండి దూరమైన సంగతి తెలిసిందే.ఇక ఆ షో నుంచి తప్పుకొని స్టార్ మా లో సెటిల్ అయింది.ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు.బాగా ఫోటో షూట్ లు తీయించుకుంటూ వాటిని పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం వెంటనే ఫైర్ అవుతూ ఉంటుంది.

ఇటీవలే చాలామంది ట్రోలర్స్ ఆమెను ఆంటీ అంటూ బాగా టార్గెట్ చేశారు.దీంతో వాళ్లకి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది అనసూయ.

ఇదిలా ఉంటే తాజాగా అనసూయ పై మరోసారి ట్రోల్స్ జరుగుతున్నాయి.తాజాగా తను ఒక డాన్స్ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.ఇక ఆ వీడియోలో తను మేకప్ లేకుండా కనిపించింది.దీంతో తనను అలా చూసిన నెటిజన్స్.మేకప్ లేకుంటే మీరు ఇలా ఉంటారా అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతకుముందు కూడా తను మేకప్ లేకుండా చాలా సందర్భాలలో కనిపించగా అప్పుడు కూడా ఇటువంటి కామెంట్స్ చేశారు నెటిజన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube