China Covid : చైనాలో ఏం జరుగుతుంది... వేల సంఖ్యలో క్వారెంటైన్ సెంటర్ లు..!!

భూమ్మీద మానవ మనుగడ తల్లకిందులు చేసిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి.2019 నవంబర్ నెలలో మొట్టమొదటి కరోనా వైరస్ చైనాలో బయటపడటం తెలిసిందే.ఆ తర్వాత కొద్ది నెలలకే ప్రపంచవ్యాప్తంగా వైరస్ విస్తరించింది.ఈ క్రమంలో ప్రపంచ దేశాలు అనేక నిర్ణయాలు తీసుకోవటంతో పాటు లాక్ డౌన్ లు విధించడం.జరిగింది.ఇదే టైములో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

 What Will Happen In China... Thousands Of Quarantine Centers China, Covid, Quare-TeluguStop.com

పేదవారు మొదలుకొని ధనవంతులు వరకు అందరూ.వైరస్ బారిన పడటం జరిగింది.

  అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతీసిన ఈ వైరస్ ఇప్పుడు చైనా మినహా ప్రపంచ దేశాలలో కంట్రోల్ లోనే ఉంది.కానీ చైనాలో మాత్రం ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా మారింది.

ఏకంగా ఇప్పుడు అక్కడ రోజు వారి కేసులు 40 వేల పైగా నమోదు అవుతూ ఉండటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమయింది.అధిక కేసులు వస్తున్న ప్రాంతాలను భారీ కేడ్ లతో ద్రిగ్బంబంధం చేసి లాక్ డౌన్ లు అమలు చేస్తూ ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగాలకు వెళ్లలేక ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోలేక.చైనా ప్రభుత్వంపై జనాలు తిరగబడుతున్నారు.ఇటువంటి తరుణంలో చైనా ప్రభుత్వం… ప్రత్యేక ఆసుపత్రులు, క్వారెంటైన్ సెంటర్లను వేలల్లో నిర్మిస్తున్నారు.చైనాలోని గ్వాంగ్జూ సిటీ శివార్లలో సుమారు 1.30 లక్షలకు పైగా జనాభా కెపాసిటీ కలిగిన హాస్పిటల్స్ నిర్మిస్తోంది.ఇంకా పలు నగరాలలో క్వారెంటైన్ గదులు, ప్రత్యేక ఆసుపత్రుల నిర్మాణం చెప్పడుతోంది.దాదాపు క్వారెంటైన్ సెంటర్లలో 2.5 లక్షల మంది వైరస్ బాధితులకు ఆశ్రయం కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది.ప్రపంచం వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా కంట్రోల్ లో ఉన్నాగాని చైనాలో… ఇన్ని వేల కేసులు.నమోదు కావటం పట్ల అనేక అనుమానాలు వస్తున్నాయి.మిగతా దేశాలపై చైనా ఏదైనా కుట్ర పన్నుతుందా అనే చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube