టీడీపీ, జనసేన పార్టీలు కలిస్తే తప్పేంటని టీడీపీ నేత యనమల ప్రశ్నించారు.చంద్రబాబు, పవన్ భేటీతో జగన్ లో ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.
పొత్తులు అనేది ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయమన్నారు.40 ఏళ్లుగా ఉన్న పార్టీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.చంద్రబాబు నాయకత్వం కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.5 సొంత ఇళ్లు కట్టుకున్న జగన్ … 5 కోట్ల జనాభాకు 5 ఇళ్లు మాత్రమే కట్టించారని ఆరోపించారు.టీడీపీలోకి కొత్త రక్తం కావాలన్న ఆయన దానిపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.







