రజనీకాంత్‌ చెప్పింది నిజమే ఎమ్మెల్యే వసంత ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో గౌరవనీయులు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్( Vasantha Venkata Krishna Prasad ) గారి వ్యాఖ్యలు మరోమారు రాజకీయాన్ని వేడెక్కించాయి.మైలవరంలో అసంతృప్తవాదులపై ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 What Rajinikanth Said Is True Mla Vasantha Venkata Krishna Prasad Interesting-TeluguStop.com

మైలవరం( Mylavaram ) వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపిణిలో వసంత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

ఈ రాష్ట్రం లో 175 మంది ఎమ్మెల్యేలలో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైన ఉంటే వాళ్ళల్లో తాను ఒకడనని అన్నారు.తాను ఎంత సౌమ్యంగా ఉంటాననేది ఒక ప్రక్క అయితే రెండో ప్రక్క కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

భయపెట్టో మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్‌ను లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు.పదవులు ఇచ్చేదాకా నక్కవినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని విమర్శించారుసినిమాలో రజనీకాంత్( Rajinikanth ) చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్ళు, ఈ రెండూ లేని ఊళ్ళు ఉండవు రాజా!అంటూ వ్యాఖ్యలు చేశారు.

వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube