బుల్లితెరపై డాన్స్ ప్లస్, సిక్స్త్ సెన్స్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రముఖ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఓంకార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈ క్రమంలోనే ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు ఇప్పటికే పలు సినిమాలలో నటించి అందరినీ ఎంతగానో ముఖ్యంగా అశ్విన్ బాబు నటించిన రాజుగారి గది వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు.విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.
ఇప్పటివరకు ఆరు సినిమాలలో నటించిన అశ్విన్ తాజాగా 7 వ సినిమా చేయబోతున్నారు.
అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో, శ్రీ విగ్నేస్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలోనే అశ్విన్ నటించబోయే ఏడవ సినిమా కావడంతో #AB 7 పేరుతో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ పోస్టర్ లో హీరో చేతికి గాయం తగిలి రక్తం కారుతున్నప్పటికీ, పిడికిలి బిగించి నిలబడటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.ప్రస్తుతం ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర బృందం ఈరోజు మధ్యాహ్నం 2:52 నిమిషాలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రెండు విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు.ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా మారిన ఈ ప్రీ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమాలో అశ్విన్ బాబు సరసన హీరోయిన్ గా నందిత శ్వేత సందడి చేయనున్నారు.