టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేధికగా టీడీపీ మొదటి మేనిఫెస్టో( TDP Manifesto _ ను ప్రకటించారు.ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉన్నప్పటికి ఇప్పుడే మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల సమరానికి తెరతీశారు.
మరి ఇంత త్వరగా ఆగమేఘాలపై మేనిఫెస్టో ఎందుకు ప్రకటించారు ? అసలు చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు ? మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు నిజంగా ప్రజలను ఆకర్షించే విధంగా ఉన్నాయా అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఆ పార్టీకి మరియు చంద్రబాబు( Chandra babu naidu )కు అత్యంత కీలకం.

ఇప్పటికే తన చివరి ఎన్నికలని ప్రకటించి గెలుపుకోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు చంద్రబాబు నాయుడు.ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి తమవైపు తిప్పుకోవాలంటే మేనిఫెస్తేనే అసలైన అస్త్రం అని భావించి మహానాడు వేధికగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.ఇక ఈ మేనిఫెస్టోలో చాలా అంశాలనే హైలెట్ చేశారు చంద్రబాబు.ముఖ్యంగా నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు పెద్దపీట వేశారు.18 ఏళ్ళు నిండిన ప్రతిమహిళకు ” ఆడబిడ్డ నిధి ” కింద నెలకు 1500 రూపాయలు, దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువగళం కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000.ఇలా చాలా అంశాలనే మేనిఫెస్టోలో ప్రకటించి అందరి దృష్టి టీడీపీ పై పడేలా చేశారు చంద్రబాబు.

అయితే పథకాలు ప్రకటించిన బాబు వాటి అమలు ఎలా చేపడతారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే పని వాలెంటర్లు చేస్తున్నారు.ఒకవేళ టీడీపీ అధికారంలో( TDP )కి వస్తే వాలెంటరీ వ్యవస్థ ఉంటుందో ఉండదో అనే క్లారిటీ లేదు.దీంతో టీడీపీ మేనిఫెస్టోపై నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రకటించిన పథకాలు ఆకర్షణీయంగానే ఉండడంతో ప్రస్తుతం ఈ మేనిఫెస్టో హాట్ టాపిక్ అయింది.మరి వైసీపీ కూడా మేనిఫెస్టో ప్రకటనపై కసరత్తులు చేస్తుందా ? ప్రస్తుతం మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల హిట్ ను పెంచిన చంద్రబాబు దూకుడుకు వైసీపీ ఎలా కట్టడి వేస్తుంది అనేది చూడాలి.