విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హీరోయిన్లు ఒక వెలుగు వెలిగిపోతూ ఉంటారు అలాంటి వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరావు లాంటి వారు అగ్రహీరోలు గా ఉండగా వారి తర్వాత వచ్చిన చిరంజీవి నెంబర్ వన్ హీరో గా ఎదిగారు.

అలాగే హీరోయిన్లలో కూడా చాలా మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అప్పట్లో విజయశాంతి గారు కొన్ని సంవత్సరాలు నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగారు.

ఆమె ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరితో చాలా సినిమాల్లో నటించారు.అలాగే హీరోయిన్ గా గుర్తింపు వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

ప్రతిధ్వని, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.డైరెక్టర్ T.కృష్ణ డైరెక్షన్ లో విజయశాంతి గారు చాలా సినిమాల్లో నటించారు ఒక విధంగా తనకి నటిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలన్నీ టి కృష్ణ గారి సినిమాలే.ఇండస్ట్రీలో T.కృష్ణ గారు అంటే విజయశాంతి గారికి ఎనలేని గౌరవం ఉండేది.విజయశాంతి చిరంజీవి తో గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన తర్వాత నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలకృష్ణతో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా లో ఆటో రాణి గా తన క్యారెక్టర్ కి తగ్గ నటనతో మంచి గుర్తింపును సాధించారు.

What Is The Relation Between Vijyashanthi Husband And Ntr, Chiranjeevi, Vijyash
Advertisement
What Is The Relation Between Vijyashanthi Husband And NTR, Chiranjeevi, Vijyash

రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా లో వీలైనప్పుడు రౌడీలతో ఫైట్ సీన్ లను కూడా చాలా బాగా చేశారు.నాగార్జున హీరోగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన జానకి రాముడు సినిమాలో విజయశాంతి ఒక పాటలు పాడే అమ్మాయి తన గొంతు ని కోల్పోతే పడే బాధ ఎలా ఉంటుంది అనేది సినిమాలో నటించి మన అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ సినిమా లో తనకి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా దక్కాయి దొరల పేత్తందారి వ్యవస్థకి నలిగిపోతున్న తక్కువ జాతి కులాల వారి బతుకులు ఎలా ఉంటాయి అనేది సినిమాలో చూపిస్తే గిరిజన యువతిగా విజయశాంతి తనదైన నటనని చూపించింది.

అయితే విజయశాంతి ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు.

What Is The Relation Between Vijyashanthi Husband And Ntr, Chiranjeevi, Vijyash

ప్రసాద్ ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్ పెద్దల్లుడు అయిన గణేష్ రావు గారి స్వయాన మేనల్లుడు.ప్రసాద్ కి బాలకృష్ణ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది ఆ ఫ్రెండ్ షిప్ తోనే బాలకృష్ణ సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేయాలని ప్రసాద్ అనుకొని కోదండరామి రెడ్డి డైరెక్షన్లో వచ్చిన నిప్పురవ్వ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు.ఆ సినిమా లో హీరోయిన్ గా పలువురు హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ ఫైనల్ గా విజయ శాంతి ని కన్ఫామ్ చేశారు.

అప్పుడు విజయశాంతి గారి డేట్స్ కోసం ప్రసాద్ వెళ్ళినప్పుడు విజయశాంతికి ప్రసాద్ కి పరిచయం ఏర్పడింది.అప్పటికే విజయశాంతి వాళ్ళ అమ్మానాన్న చనిపోవడంతో ప్రసాద్ పరిచయం ఫ్రెండ్షిప్ గా మారింది ఎంతలా అంటే ప్రసాద్ విజయశాంతి డేట్స్ చూసుకునేవాడు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలా ఇద్దరి మధ్య ప్రెండ్ షిప్ కుదిరి పెళ్లి చేసుకున్నారు.కొన్నాళ్లపాటు వీళ్ళ కాపురం సాఫీగానే సాగింది.ప్రస్తుతం ప్రసాద్ ఎక్కడ కనిపించినప్పటికీ విజయశాంతి ప్రసాద్ కలిసి ఉంటున్నారా లేదా అనేది తెలియదు.

Advertisement

విజయశాంతి మాత్రం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమా తో మంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.విజయశాంతి రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటోంది ప్రస్తుతం ఆవిడ బిజెపి పార్టీలో కొనసాగుతుంది.

తాజా వార్తలు