రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది కనుక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వివిధ నగరాలలో నిర్వహించారు.
ఇక ఈ నెల 19వ తేదీ కర్ణాటకలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం కర్ణాటక ముఖ్యమంత్రి, హెల్త్ మినిస్టర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.అయితే ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీలా సందడి చేశారు.
ఈ విధంగా శ్రీలీలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తళుక్కుమనడంతో ప్రతి ఒక్కరు ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.అసలు ఈ సినిమాకి నటి శ్రీలీలాకి సంబంధం ఏమిటి ఆమె ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అంటూ పెద్దఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

సాధారణంగా ఒక సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక అంటే అతిథులుగా ఆహ్వానించిన వారు అలాగే చిత్రబృందం పాల్గొంటారు.అయితే శ్రీలీల ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించింది లేదు కానీ ఈ రిలీజ్ వేడుకకు ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే. శ్రీలీల తెలుగమ్మాయే అయినా, కన్నడ సినిమాల ద్వారా తెరంగేట్రం చేసింది.అలాగే కన్నడలో కూడా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఇలా కన్నడనాట ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రావడానికి గల కారణం తను ఎన్టీఆర్, రామ్ చరణ్ కు అభిమాని కావడమే.ఒక సాధారణ అభిమానిగా శ్రీలీల ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ లో సందడి చేశారు.







