వైయస్సార్ ముద్దుబిడ్డ షర్మిల ( Sharmila ) ఎప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తానని, కేసీఆర్ ని ఓడిస్తానని చెప్పింది.
కానీ చివరికి తన పార్టీకి సరైన క్యాడర్ లేకపోవడంతో కాంగ్రెస్లో విలీనం చేస్తాను అని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్లోని కొంతమంది లీడర్లు ఆమె రాకను అడ్డుకున్నారు.దాంతో సొంతంగా నేనే పోటీ చేస్తాను అని చెప్పినప్పటికీ అదీ జరగలేదు.
ఇక చివరికి చేసేదేమీ లేక ఎన్నికల బరి నుండి తప్పుకొని నా పూర్తి మద్దతు కాంగ్రెస్ కే అంటూ తెలంగాణ రాజకీయాల ( Telangana Politics ) నుండి తప్పుకుంది.అయితే త్వరలోనే ఆంధ్రాలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇక ఏపీలోని కాంగ్రెస్లో షర్మిలకు కీలక పదవి ఇస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.అయితే ఇలాంటి ప్రచారం జరుగుతున్న వేళ షర్మిల చేసిన పని రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అదేంటంటే తాజాగా క్రిస్మస్ సందర్భంగా షర్మిల నారా లోకేష్ ( Nara lokesh ) కి క్రిస్మస్ గిఫ్ట్ లను పంపడం ప్రస్తుతం ఆంధ్రాలో హాట్ టాపిక్ గా మారింది.షర్మిల పంపిన గిఫ్టులు చాలా బాగున్నాయి అంటూ నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.
దాంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y.S.Jagan Mohan reddy ) కి అపోజిషన్ పార్టీ అయినా టిడిపి పార్టీకి చెందిన నారా లోకేష్ కి షర్మిల ఎందుకు గిఫ్టులు పంపింది.అసలు వీరి కొత్త దోస్తీ వెనకున్న మతలబ్ ఏంటి అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
అంతేకాకుండా షర్మిల కొడుకుకి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియా అట్లూరి ( Priya Atluri ) తో పెళ్లి ఫిక్స్ అయిన సంగతి మనకు తెలిసిందే.అందుకే షర్మిల నారా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు.
అంతేకాకుండా వైయస్ జగన్ పుట్టినరోజున కూడా తన అన్నకి బర్త్డే విషెస్ చెప్పలేదు.
అయితే గత కొద్ది రోజులుగా జగన్ కి షర్మిల కి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్ లు పంపడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.ఇక ఈ విషయంపై చాలామంది వైసిపి ( YCP ) అభిమానులైతే షర్మిలపై గుర్రుగా ఉన్నారు.
అంతేకాదు సొంత అన్న పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పడం తెలియదు కానీ క్రిస్మస్ కి నారా లోకేష్ కి గిఫ్టులు పంపడం ఏంటి అంటూ వైసీపీ అభిమానులు షర్మిల చేసిన పనిని వ్యతిరేకిస్తున్నారు.మరి నారా లోకేష్ షర్మిల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు దారితీస్తుంది? ఈ ఎన్నికల్లో షర్మిల కూడా టిడిపి ( TDP ) పార్టీకే సపోర్ట్ చేస్తుందా అనేది చూడాలి.