ఆడ పిల్లలకు చెవులు ఎందుకు కుట్టిస్తారు?

ఆడపిల్లలకు చెవులూ, ముక్కు కుట్టించి చక్కని ఆభరణాలు పెడ్తారు. చిన్న చిన్న పిల్లలకే చెవులు కుట్టిస్తుంటారు.

 కేవలం అందం  కోసమే ఆడ పిల్లలకు చెవులూ ముక్కు కుట్టిస్తారా లేదా దీని వెనుక ఏదైనా విశేష ముందా తెలుసుకుందాం.ఇప్పుడంటే కేవలం ఆడ పిల్లలకే చెవులు కుట్టిస్తున్నారు కానీ పాత కాలంలో మగ పిల్లలకు కూడా చెవులు కుట్టించే వాళ్లు.

What Is The Reason Behind Children Have Their Ears Peirced , Chevulu Kutttinchad

 మగ పిల్లలకు చెవులు కుట్టిస్తే. రెండో సారి ఆడ పిల్ల పుడుతుందనే నమ్మకం చాలా మందికి ఉంటుంది.

 అంతే కాకుండా ఆడ పిల్లలకు చెవులూ, ముక్కు కుట్టించి లక్ష్మీ దేవిలా తయారు చేసుకొని మురిసిపోయే కార్యక్రమం వెనుక మరో ఆరోగ్య రహస్యం కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుందట.

Advertisement

 ఆక్యుపంక్చర్ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది. అందుకే చిన్న పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించాలని సూచిస్తున్నారు. చెవులు కుట్టిస్తే పిల్లలు ఏడుస్తారని, వాళ్లకి నొప్పి పుడుతుందని భయపడుతూ.

 చెవులు కుట్టించకపోవడం తప్పని చెబుతున్నారు. కొన్ని రోజుల్లో తగ్గిపోయే ఈ చిన్న పాటి పుండ్ల కోసం చెవులు కుట్టించక పోవడం సరికాదంటున్నారు.

ఆడ పిల్లలకు చెవులు కుట్టించి పోగులు పెడ్తే. అచ్చం మహా లక్ష్ముల్లా కనిపిస్తుంటారు.

 చెవులు కుట్టించాక కొన్నాళ్ల పాటు చెవుల దగ్గర మంచి నూనె లేదా కొబ్బర నూనెతో మర్దనా చేయాలి. అలా చేస్తే చాలా లేతగా ఉండి  కందిపోయిన చిన్నారుల చెవులకు నొప్పి తగ్గుతుంది.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..
Advertisement

తాజా వార్తలు