పండుగ రోజు ఉల్లిపాయలు తినకూడదా..?

పండగలు, పబ్బాలు అంటే నాన్ వెజ్ వండుకునే పండుగలు కాకుండా మిగతా అన్ని పండుగల అప్పుడు ఉల్లిపాయలు తినకూడదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

ఎందుకంటే పండుగ రోజులు, అలాగే పూజ చేసుకునే దినాలు చాలా పవిత్రమైనవి.

ఆ రోజంతా మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకోవాలి.అలాగే మనసును, శరీరాన్ని భగవంతుడి మీదే లగ్నం చేయాలి.

అలా మనసంతా దైవం మీదే ఉండాలంటే ఉల్లిపాయను తినకూడదని చెబుతారు పెద్దలు.ఉల్లిపాయలో ఉత్తేజం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది.

నిగ్రహాన్ని సడలించేలా చేస్తుంది.వాటిని ఆ రోజుల్లో దూరంగా ఉంచాలి.

Advertisement
What Is The Reason Behind Brahmins Do Not Eat Onion, Onion, Brahmins, Pooja , N

అందుకే ఉల్లిపాయను తినకూడదని చెబుతుంటారు.అందుకే ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉల్లిపాయలు తినరు.

అసలు ఇంట్లో ఏ ఒక్క వంటలోనూ వాడరు.అందుకు ప్రధాన కారణం.

బ్రాహ్మణులు ఎక్కువగా పెళ్లిళ్లు, పూజలు వంటి శుభ కార్యాలు జరిపిస్తుంటారు.అలాంటప్పుడు ఎంతో మంది ఆడ వాళ్ల చేతులు వారికి తగులుతుంటాయి.

అలాంటప్పుడు వారు నిగ్రహం కోల్పోకుండా ఉండాలని ఉల్లిపాయలను తినరు.

What Is The Reason Behind Brahmins Do Not Eat Onion, Onion, Brahmins, Pooja , N
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఇంట్లోని స్త్రీని తప్ప బయట వారెవరినీ అలా చూడకూడదు అనే ఉద్దేశంతోనే ఉల్లిపాయలు తినకూడదని చెబుతుంటారు.మనకు కారణం తెలీకుండా తింటే ఏమవుతుందిలే.ఏం పర్లేదు అనుకుంటుంటాం.

Advertisement

కానీ పెద్దలు చెప్పే ప్రతీ మాట వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉంటుంది.అందుకే ఇక మీదట అయినా ఉల్లిపాయలు తినకుండా ఉండే మంచిది.

పెద్దలు చెప్పిన మాటలు విని పాటిస్తే.మనకే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు