తెలంగాణలో వచ్చేది బీజేపీ ( BJP )ప్రభుత్వమేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆ మద్య కమలనాథులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.కానీ ఎవరు ఊహించని విధంగా కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో తెలంగాణలో కూడా పార్టీ డీలా పడింది.
దానికి తోడు నేతల మద్య నెలకొన్న అనిశ్చితి, విభేదాలు, వర్గపోరు ఇలా ఒక్కో సమస్య పెరుగుతూ వచ్చింది.ఫలితంగా ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.
పార్టీలో కొంతమంది నేతల మద్య ఉండే అసంతృప్తి ఒక్కొక్కటిగా బయట పడుతోంది.ఆ మద్య ప్రదాన్యత కోసం ఈటెల అలకబూనితే, తనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని రఘునందన్( Raghunandan ) అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక పదవుల విషయంలో అధిష్టానం చొరవ తీసుకొని మార్పులు చేపడితే.ఇప్పుడు మరికొంత మంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీకి సంబంధించిన అన్నీ కార్యకలాపాలు ఓ ముగ్గురి ద్వారానే జరుఘున్నాయని ఇంకా మిగిలిన వారికి ఎలాంటి ప్రదాన్యం ఇవ్వడం లేదని అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సీనియర్ నేత వివేక్ ( Vivek )ఇంట్లో ఆ మద్య కొంత మంది బీజేపీ నేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే.ఈ సమావేశం పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బయట పెట్టింది.ఇక వచ్చే నెల 1 వ తేదీన ప్రధాని మోడి( Prime Minister Modi ) తెలంగాణకు రానున్నారు.ఈ నేపథ్యంలో మరికొంత మంది బీజేపీ నేతలు విజయశాంతి( Vijayashanti ) ఇంట్లో సమావేశం కావడం చర్చకు దారి తీస్తోంది.
ఈ సమావేశంలో విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి వంటివారు ఉన్నారు.దీంతో మోడి రాక సందర్భంగా ఆ పార్టీకి వీరంతా షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.వీరంతా పార్టీ మారతారనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.మోడి తెలంగాణకు వచ్చినప్పుడు పార్టీలో సీనియర్లను గుర్చించాలనే ప్రతిపాదనను ఆయన ముందుంచే ఆలోచనలో ఉన్నట్లు టాక్.మోడి నుంచి ఏ మాత్రం సానుకూల స్పందన రాకపోయిన.వీరంతా కాషాయ పార్టీకి టాటా చెబుతారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి ఈ ఆరుగురు ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగుతారో చూడాలి.ప్రస్తుతం బీజేపీలో విజయశాంతి, వివేక్, కొండ విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటివారు వ్యవహరిస్తున్న శైలి పార్టీని కొంత కలవర పెడుతున్నట్లే కనిపిస్తోంది.