తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడవ ప్రభుత్వముగా కాంగ్రెస్ గద్దెనెక్కింది.రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి రెండు పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించింది.
పది సంవత్సరాల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అవినీతి కూడా చాలా జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తోంది.అంతేకాకుండా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడ్డారని, ఆ ప్రభుత్వ పాలన నచ్చకే ప్రజలు మార్పు కోరుకున్నారని కాంగ్రెస్, బిజెపి నాయకులు చెప్పుకొస్తున్నారు.
అయితే బిజెపి ( BJP ) , కాంగ్రెస్ అంటే నిప్పులో ఉప్పులా ఉండే పార్టీలు.కానీ ఈ పార్టీల పరిస్థితి తెలంగాణలో మరోరకంగా కనిపిస్తోంది.
ఈ రెండు పార్టీల ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ, బిజెపి కీలక నేత అయినటువంటి బండి సంజయ్ ( Bandi sanjay ) నుంచి సపోర్టు లభిస్తోంది.
ఇదే తరుణంలో కొత్త ప్రభుత్వం అన్ని రకాల విషయాలు గమనించక ముందే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వంను ఎత్తి పొడుస్తూ పలు విమర్శలు చేస్తోంది.
![Telugu Bandi Sanjay, Congress, Revanth Reddy, Telangana-Politics Telugu Bandi Sanjay, Congress, Revanth Reddy, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/CM-Revanth-reddy-bjp-congress-kcr-ktr-ts-politics-harish-rao.jpg)
ఇదే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy ) మాత్రం అవేమీ పట్టించుకోకుండా పేద ప్రజలకు అందే ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు.అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని కూడా పూర్తిగా బయటకు తీయాలని ముందడుగు వేస్తున్నారు.అయితే రేవంత్ రెడ్డి ఆలోచనలకు బిజెపి అధినాయకుడు బండి సంజయ్ పూర్తిగా సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తుండడం కనిపిస్తోంది.
![Telugu Bandi Sanjay, Congress, Revanth Reddy, Telangana-Politics Telugu Bandi Sanjay, Congress, Revanth Reddy, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Bandi-sanjay-CM-Revanth-reddy-bjp-congress-kcr-ts-politics-harish-rao.jpg)
అయితే ఆయనకు బహిరంగంగా సపోర్ట్ చేయకపోయినా కానీ , లో లోపల మాత్రం కేసీఆర్ ( KCR ) కుటుంబ అవినీతి మీద సమగ్రంగా దర్యాప్తు చేయించాలని రేవంత్ రెడ్డిని బండి సంజయ్ కోరుతున్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలు కూడా రేవంతు శాసనసభలో ప్రస్తావించడాన్ని బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.ఈ మేరకు ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎంకు లేఖ కూడా రాశారు బండి సంజయ్.బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెల్లించాలని బండి కోరారు.
ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలను బిజెపిలో కీలక నాయకుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ ఖండించాల్సింది పోయి , సపోర్ట్ గా నిలవడం చూస్తుంటే మాత్రం వీరిద్దరి మధ్య విపరీతమైనటువంటి ప్రేమ పెరుగుతోందని, ఇది ఎక్కడికి దారితీస్తుందో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.