తెలుగు సినిమా పరిశ్రమలో కొన్నాళ్ల ముందు వరకు మెగా మరియు మంచు ఫ్యామిలీ లు అంటే ఒకరికి ఒకరు పడక పోయేది.మెగా ఫ్యామిలీ పై కోపంతో రామ్ గోపాల్ వర్మతో మోహన్ బాబు సన్నిహిత్యంగా ఉన్నాడు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినిమా పరిశ్రమ లెజెండ్స్ అంటూ వీరిద్దరి మద్య అభిమానులు పెద్ద గొడవే రాజేయడం ఇద్దరు కూడా ఒకానొక సమయంలో చాలా గొడవలు పడటం జరిగింది.కాని ఇండస్ట్రీలో ఎప్పుడు కలుసుకోవడాలు మాట్లాడుకోవడాలు జరుగుతూనే ఉంటాయి.
బయట ఎలా ఉన్నా లో లోపల కుమిలి పోతున్నా కూడా ఒకరికి ఒకరు హగ్ లు ఇచ్చుకోవడం ఒకరిని ఒకరు సమర్థించుకోవడం వంటివి చేస్తూనే ఉంటారు.ఈ విషయంలో చిరంజీవి మరియు మోహన్ బాబులు ఏమీ అతీతులు కాదు అని మరోసారి నిరూపితం అయ్యింది.

ఆమద్య చిరంజీవిని వాడు వీడు అంటూ సంభోదించిన చిరంజీవి కొన్నాళ్లుగా మర్యాదతో పాటు ఆప్యాయంగా పిలవడం మొదలు పెట్టాడు.ఇద్దరం మంచి మిత్రులం అంటూ మోహన్ బాబు మరియు చిరంజీవిలు పదే పదే అంటున్నారు.వీరిద్దరు కూడా చాలా సందర్బాల్లో కలుస్తున్నారు.ఇటీవల ఆచార్య సినిమా షూటింగ్ సందర్బంగా కూడా వీరు కలిశారు.ప్రత్యేకంగా చిరంజీవిని ఎందుకు మోహన్ బాబు కలిశాడు అనేది అందరికి పెద్ద ప్రశ్నగా మారింది.అసలు వీరిద్దరి కలయిక వెనుక ఉన్న కారణం ఏంటీ అనేది ఎవరికి తెలియడం లేదు.
మెగా మరియు మంచు ఫ్యామిలీ ల మద్య ఏదో జరుగబోతుంది.అది ఏంటీ అనేది మాత్రం తెలియడం లేదు.
త్వరలోనే మెగా మంచు కాంబోలో ఏమైనా సినిమాలు వచ్చే అవకాశం ఉందా అంటున్నారు.ఈ మద్య కాలంలో చిరంజీవి ఎవరితో నటించేందుకు అయినా సిద్దంగా ఉన్నాడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఇలాంటి సమయంలో మెగా మంచు కలయిక అసాధ్యం ఏమీ కాదు.కాని అసలు విషయం ఏంటీ అనేది మాత్రం తెలియాల్సి ఉంది.