పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 70,000 పైచిలుకు మెజారిటీ తో తన ప్రత్యర్థి అయిన వంగా గీత( Vanga Geeta ) పై గెలిచి తన సామర్థ్యం ఏంటో అందరికీ తెలియజేశాడు.గత పది సంవత్సరాలుగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అవమానిస్తున్న, వ్యక్తిగతంగా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి భార్యల పేర్లు చెప్పి ఆయన్ని వేధిస్తున్న, ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఈ పదేళ్లు వెన్ను చూపకుండా ప్రతి గడప తిరిగి తన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంతో పాటు టిడిపిలోనే స్టార్ క్యాంపెనర్ గా నిలబడ్డాడు ప్రస్తుతం మినిస్టర్ కాబోతున్నాడు మంచి పోస్ట్ అతనికి దక్కుతుంది ఇది అందరికీ సంతోషకరమైన విషయమే.
కానీ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో.తను టాలీవుడ్ నుంచి వెళ్లి మంచి స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా మరి ఒప్పుకున్న సినిమాల పరిస్థితి ఏంటి? ఆయన సినిమాలు తీస్తాడని ఎదురుచూస్తున్న దర్శకులు తర్వాత ఏం చేయాలి ?అలాగే అభిమానులు అందరూ ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మరియు వాటి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.వారికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పనున్నాడు అనే విషయాలపై క్లారిటీ రావడం లేదు.

ప్రస్తుతం ప్రతి సగటు పవన్ కళ్యాణ్ అభిమాని మనసులో తర్వాత ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.ఓవైపు రాజకీయాలు మరియు ప్రభుత్వం బాధ్యతలు నెరవేరుస్తూ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తాడా ? భవిష్యత్తులో అసలు సినిమాలు తీస్తాడా లేదా ? టాలీవుడ్ ని మర్చిపోయి కేవలం రాజకీయాలకే పరిమితం అవుతాడా ? అంటూ అనేక మంది ప్రశ్నిస్తున్నారు.పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల వల్ల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయనను ఎమ్మెల్యేగా అందరి చూస్తున్నారు.
అలాగే మంత్రిగా కూడా చూస్తారు కానీ ప్రతి అభిమాని కోరుకునేది ఆయన సినిమాలు కూడా విడుదల అవ్వాలని, ప్రతి సంవత్సరం ఆయన తరపున ఒకటి లేదా రెండు సినిమాలు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నారు.

ఇక కేవలం సినిమాలు మాత్రమే కాదు టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీ ని కూడా ఎంతో డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పై ఉంది.కూటమి ద్వారా వచ్చిన సీట్స్ కన్నా కూడా సొంతంగా టిడిపి కూడా బాగానే మెజారిటీ సాధించుకుంది కాబట్టి ఆయన మాటలను టిడిపి వారు వింటారా టాలీవుడ్ కి మంచి చేస్తారా అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది.చూడాలి ముందు ముందు రాజకీయాలు ఏ విధంగా మారుతాయో అలాగే పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కూడా ఏ వైపు వెళుతుందో ? అంతా మంచి జరిగితే రాజకీయాలను, సినిమాలను రెండు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లగలగాలి అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకుంటున్నారు.మరి వీటిపై పవన్ కళ్యాణ్ సైతం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.