ప్రభుత్వం ప్రజల నుంచి నఅేక రూపాల్లో పన్నులు వసూలు చేస్తూ ఉంటుంది.ఇందుకోసం అనేక పద్ధతులను అనుసరిస్తూ ఉంటుంది.
వాటిల్లో ముఖ్యమైనవి టీడీఎస్, టీసీఎస్లు అనేది మనందరికీ తెలిసిందే.అయితే టీడీఎస్, టీసీఎస్ అంటే ఏమిటి? వాటి మధ్య గల తేడాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు.ఆ రెండింటి మధ్య తేడాలేంటి అనే గందరగోళం చాలామందిలో ఉంటుంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీడీఎస్( Tax Deducted at Source ) అంటే టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని అర్థం.ఇక టీసీఎస్ టాక్స్ కలెక్డెడ్ ఎట్ సోర్స్ అని అర్థం.ఈ రెండు కూడా పన్నుకు సంబంధించినవే.కానీ పన్ను సేకరణ పక్రియలో ఇవి వేరు వేరు పాత్రలు పోషిస్తాయి.ఏ పద్దతిలో వసూలైన సొమ్ము అయినా ప్రభుత్వ ఖాతాలోనే జమ అవుతుంది.టీడీఎస్ అంటే కంపెనీ ఒక వ్యక్తికి చేసిన చెల్లింపులపై విధించే పన్ను.
అంటే ఉద్యోగికి ఒక కంపెనీ అందించే జీతాలు, అద్దె చెల్లింపులు, బ్రోకరేజీ, కమీషన్, ప్రొఫెషనల్ ఫీజు లాంటి చెల్లింపులపై టీడీఎస్ తప్పనిసరిగా వర్తిస్తుంది.అలాగే నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ చెల్లింపులు జరిపినప్పుడు కూడా టీడీఎస్ వర్తిస్తుంది.

ఇక టీసీఎస్( Tax collection at source ) విషయానకొస్తే.కొనుగోలుదారుడికి ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు.వసూలు చేసే పన్ను ఇది. కలప, స్క్రాప్ లాంటి వస్తువుల అమ్మకాలపై టీసీఎస్ వర్తిస్తుంది. తయారీ సామగ్రి మినహా ఇతర వస్తువుల అమ్మకాలపై టీసీఎస్ వర్తిస్తుంది. చెల్లింపులు చేసే యజమాని టీడీఎస్ డిడిక్ట్ చేస్తాడు.ఇక ఆదాయాన్ని స్వీకరించేవారు టీసీఎస్ డిడక్ట్ చేస్తారు.పన్ను ఎగవేతను నివారించేందుకు ముందుగా ట్యాక్స్ ను కట్ చేస్తారు.
చెల్లించిన ట్యాక్స్ మళ్లీ మనకు తిరిగి రావాలంటే ట్యాక్స్ రిటర్న్మ్( Tax Return ) కుఅప్లై చేసుకోవాల్సి ఉంటుంది.