సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్ లు ఉంటాయి.ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతుంటారు.
హీరోలు, డైరెక్టర్లు ఈ కాంబినేషన్ ల కోసం ఎంతో ట్రై చేస్తుంటారు.అయితే ఈ కాంబినేషన్ లు కొన్ని సార్లు వర్క్ అయితే మరికొన్ని సార్లు రివర్స్ అవుతుంది.
కానీ చివరి నిమిషంలో కొన్ని కాంబినేషన్ లు మిస్ అవుతుంటాయి.ఇలానే మిస్ అయిన ఒక క్రేజీ కాంబినేషన్ గురించి వార్త వైరల్ అవుతుంది.
నందమూరి బాలకృష్ణ,( Balakrishna ) లోకనాయకుడు కమలహాసన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా తెలిసిన విషయమే.
అయితే ఈ ఇద్దరి కాంబోలో ఓకే సినిమా మిస్ అయ్యిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ, కమలహాసన్ ( Kamal haasan )ఇద్దరు బెస్ట్ హీరోలు.ఎవరి స్టైల్ వారిదే.వీరిద్దరికి ఇండస్ట్రీలో క్రేజీ ఫాలోయింగ్ కూడా ఉంది.
అయితే వీరిద్దరూ కలిసి ఒక సినిమా నటించాల్సి ఉండింది.ఆ సినిమా ఎదో కాదు.
బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆదిత్య 369( Adithya 369 ).ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో మర్చిపోలేని విజయాన్ని అందించింది.ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.ఈ సినిమా అప్పట్లోనే బాలయ్యకు హైయెస్ట్ రికార్డులను సాధించిన మూవీ గారికార్డు నెలకొల్పింది.పూర్తిగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఫస్ట్ సినిమా ఇదే కావడంతో అప్పట్లో రికార్డులు సృష్టించింది.అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు.శ్రీకృష్ణదేవరాయుల కాలానికి వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర కోసం మొదటిగా కమల్ హాసన్ ని అనుకున్నారట.కథ విన్న ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారంట.కానీ లాస్ట్ మూమెంట్ లో ఈ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారట.
అదే టైంలో వేరే సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉండడంతో ఈ సినిమా నుంచి కమలహాసన్ తప్పుకున్నారు.మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి మరి.