భారతదేశంలోని ప్రధానమంత్రి పదవుల్లో పరిపాలించిన వాళ్లలో రాజీవ్ గాంధీ( Rajiv gandhi ) చిన్న వయసు వారు.ఇక ఈయన తల్లి ఇందిరా గాంధీ (Indira gandhi) మరణించడంతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.
అలాగే ఈయన ఆ ప్రధానమంత్రి పదవిలో ఎక్కువకాలం కూడా కొనసాగ లేక పోయారు.తమిళ తీవ్రవాదులు మానవ బాంబులు వేయడంతో ఆయన హత్యకు గురై చనిపోయారు.
ఇక అలాంటి రాజీవ్ గాంధీ (Rajiv gandhi) చనిపోయే ముందు ఓ హీరోయిన్ కి లెటర్ రాశారట.మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ హీరోయిన్ కి రాజీవ్ గాంధీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి.ఎందుకు ఆ లెటర్ రాశారు .ఆ లెటర్ లో ఏముంది.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రాజీవ్ గాంధీ ఆయన చనిపోయే ముందు ఒకప్పటి హీరోయిన్ జయచిత్ర (Jayachitra) కు ఒక లెటర్ రాసారట.అయితే వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి అని మీ అందరికీ అనుమానాలు రావచ్చు.కానీ వీరి మధ్య ఎలాంటి చెడు సంబంధం లేదు.
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జయచిత్ర కూడా కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) కీలక నాయకురాలుగా పనిచేస్తుంది.అయితే ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్న జయచిత్ర అనుకోకుండా ఓ రోజు తన సినిమా చూసి ఎలా ఉందో చెప్పమని రాజీవ్ గాంధీ కి చెప్పిందట.
కానీ ఆ సినిమా చూడడానికి రాజీవ్ గాంధీకి టైం కుదరలేదట.
ఎందుకంటే అప్పటికే ఆయన ప్రధానమంత్రి ( Prime Minister ) కావడంతో ఆమె సినిమా చూడడానికి వీలు పడలేదు.దాంతో రాజీవ్ గాంధీ హీరోయిన్ జయచిత్ర కి లెటర్ రాస్తూ.నేను మీ సినిమా చూడలేకపోతున్నాను.
కానీ టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మీ రాబోయే సినిమా చూసి ఎలా ఉందో కూడా చెబుతాను అని అందులో రాసారట.కానీ ఈ లెటర్ కు అంది ఆమె చదివిన కొద్దిసేపటికే రాజీవ్ గాంధీ మరణించారు అనే వార్తలు వచ్చాయట.
ఇక ఆయన మరణ వార్త వినగానే జయచిత్ర (Jayachitra) చాలా బాధపడుతూ ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిందట.అంతేకాదు ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి జయచిత్రకి కొన్ని వారాల సమయం పట్టిందట.