Pawan Kalyan Krish : ఎన్నికల లోపు ఒకే ఒక్క సినిమా పూర్తి చేయనున్న పవన్.. వారికి మొండిచెయ్యేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం కొన్నాళ్ళు సినిమాలకు దూరం అయ్యాడు.ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు.

వకీల్ సాబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ ఫ్యాన్స్ ను మెప్పించాడు.అయితే పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

పవన్ ఎన్ని సినిమాలను లైన్లో పెట్టినా వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నాడు.ప్రెజెంట్ రాజాకీల మీదనే ఈయన ఫుల్ ద్రుష్టి మొత్తం ఉంటుంది.

దీంతో సినిమాలకు బ్రేక్ తప్పడం లేదు.ఈయన రీఎంట్రీ ఇస్తూనే మూడు నాలుగు ప్రాజెక్టులకు కమిట్ అయ్యి అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు.

Advertisement
What Is Pawan Kalyan Planning To Do Next , Hari Hara Veera Mallu, Pawan Kalyan,K

ప్రెజెంట్ పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించాడు.ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

అయితే భీమ్లా నాయక్ సినిమాను పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ దగ్గరుండి పూర్తి చేయించడంతో ఇది అయితే రిలీజ్ అయ్యింది.కానీ ముందు కమిట్ అయిన సినిమాలు మాత్రం హోల్డ్ లో పడిపోయాయి.

What Is Pawan Kalyan Planning To Do Next , Hari Hara Veera Mallu, Pawan Kalyan,k

ఇదే క్రమంలో తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతమ్ అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి.కానీ పవన్ మాత్రం రెండు పడవల ప్రయాణం చేస్తుండడంతో ఏదీ సరిగ్గా అవ్వడం లేదు.అందులోనే 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఈ క్రమంలోనే ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు.హరిహర వీరమల్లు సినిమానే 3 నుండి 4 నెలల సమయం పట్టె అవకాశం ఉంది.

Advertisement

దీంతో ఇది ఒక్కటి మాత్రమే పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు.ఇది పూర్తి చేసి రిలీజ్ చేస్తే ఇక ఫుల్ ఫోకస్ రాజకీయాల మీద పెట్టవచ్చు అనుకుంటున్నాడు.

దీంతో ఈయనను నమ్ముకున్న వారికీ మొండిచేయి తప్పదు అని అంటున్నారు.కుదిరితే 2024 ఎన్నికల తర్వాతనే సినిమా చేస్తానని హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు