తీన్మార్ వార్తల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శివ జ్యోతి ఒకరు.తెలంగాణ యాసలో మాట్లాడుతూ కట్టు బొట్టుతో ఎంతోమందిని ఆకట్టుకున్న సావిత్రి ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఇతర బుల్లితెర కార్యక్రమాలలోనూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ కార్యక్రమం అనంతరం ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.
సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులకు పంచుకుంటారు.
ఈమె సోషల్ మీడియా వేదికగా మామిడి తోటలో దిగిన ఫోటోలను షేర్ చేశారు.
తన సొంత గ్రామంలో మామిడి తోటకు వెళ్ళినటువంటి ఈమె ఫుల్లుగా కల్లు తాగుతూ మటన్ ముక్కలు తింటూ ఎంతో ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ.మా ఊరు మామిడి తోట, మటన్ కూర, ముక్క గుడాలు ఈత కళ్ళు అంటూ క్యాప్షన్ జోడించారు.

ఈ విధంగా ఈమె మామిడి తోటలో మస్తుగా దావత్ చేసుకోవడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు నీ మొహం చూస్తేనే తెలుస్తోంది జ్యోతక్క ఫుల్లుగా కల్లు తాగావని అంటూ కొందరు కామెంట్లు పెట్టగా మీకేనా మాకు కూడా దావత్ లేదా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.