చిరంజీవి హీరో గా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన భోళా శంకర్ ( Bhola Shankar )సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అయితే సంపాదించుకుంది ఇక దీనితో ఈ సినిమా చూసిన చాలా మంది ఈ సినిమా లో చిరంజీవి యాక్టింగ్ అద్బుతం గా ఉంది అని ప్రశంశలు అందిస్తున్నారు.అలాగే ఈ సినిమా చిరంజీవి లుక్స్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి అంటూ చెప్తున్నారు…అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత మెగా ఫోన్ పట్టిన మెహర్ రమేష్ ఈ సినిమా తో ఒక మంచి హిట్ అయితే కొట్టినట్లు గానే కనిపిస్తుంది…
అయితే భోళా శంకర్ సినిమా తమిళ వేధలం సినిమా కి రీమేక్ కావడం తో ఇది చాలా వరకు అందరూ చూసిన సినిమా కాబట్టి ఎక్కువ మంది చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.అయితే ఈ సినిమా పరిస్థితి ఫైనల్ గా ఏంటి అనేది ఈ వీక్ ఎండ్ గడిస్తే గానీ చెప్పడం కొంత వరకు కష్టం అనే చెప్పాలి…ఇక దర్శకుడు మెహర్ రమేష్ చాలా రోజుల గ్యాప్ తర్వాత సినిమా తీసినప్పుడు ఏదైనా ఫ్రెష్ సబ్జెక్ట్ తో వస్తె బాగుండేది ఎందుకంటే ఈ సినిమా లో స్టోరీ ఆల్మోస్ట్ మనం ఇంతకు ముందు తెలుగు సినిమాల్లో చూసిన సబ్జెక్ట్ కావడం వల్ల తను ఒక ప్రయోగత్మకమైన కథను సెలెక్ట్ చేసుకుని వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది.ఇక ఇప్పుడు ఈ దర్శకుడు తదుపరి ప్రాజెక్టు స్టేట్స్ పైకి వస్తుందా లేదా అనేది మరో పెద్ద మిస్టరీ./br>
ఎందుకంటే భోళా శంకర్ షూటింగ్ దశలోనే అతను ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు అది కూడా తమన్నా( Tamannaah ) కీలకపాత్రలోనే అని ఇటీవల ఇంటర్వ్యూలలో కూడా చెప్పేసాడు.ఇప్పటికీ అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికి తన తదుపరి సినిమా గా మళ్ళీ మెహర్ రమేష్ డైరెక్షన్ లో నటిస్తుందా లేక మెహర్ రమేష్ మళ్ళీ వేరే హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిందేనా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి…అయితే మెహర్ రమేష్ ఇలా రీమేక్ సినిమాల్ని కాకుండా స్ట్రెయిట్ సినిమాలు చేస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు…తను ముందు తీసిన కంత్రి, బిల్లా, శక్తి,షాడో లాంటి సినిమాలు తీసిన ఈయనకి చిరంజీవి ఛాన్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…