ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్న జనసేన పార్టీ … రాజకీయంగా బలపడుతూ… నాయకులను చేర్చుకుంటూ… ముందుకు వెళ్తోంది.జనసేన రాజకీయంగా తప్పటడుగులు వేస్తోంది…పార్టీ నిర్మాణం మీద ఇంకా దృష్టిపెట్టలేదు.
పార్టీ నిర్మాణమే సక్రమంగా లేదు అనే విమర్శలు ఎన్ని వచ్చినా … ఆ పార్టీ అధినేత మాత్రం ఎక్కడా కంగారు పడడం లేదు.తాను అనుకున్న లెక్క ప్రకారం రాజకీయం నడిపించేస్తున్నాడు.ఇప్పటివరకు పార్టీలో చేరికలు తప్ప …రాజీనామాలు కనిపించని జనసేనలో ఇప్పుడు పవన్ కోటరీ నాయకుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం సంచలనం సృష్టిస్తోంది.తాజగా… జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విజయ్ బాబు వ్యక్తిగత కారణాల వల్ల జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

పవన్ అన్నయ్య చిరంజీవికి మంచి మిత్రుడుగా పేరుపడ్డ విజయబాబు సీనియర్ జర్నలిస్ట్.అయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పదవి కూడా చేపట్టారు.ఇక జనసేనలో కొన్ని నెలల క్రితమే చేరారు.ఆయనకు ఉన్న అర్హతల నేపథ్యంలో…ఆయనకు వెంటనే అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు.విజయబాబు కూడా… పవన్ కల్యాణ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే.అందులోనూ పవన్ కోటరీలో ఆయన కీలక నాయకుడిగా కూడా ఉన్నాడు.
అటువంటి కీలక వ్యక్తి జనసేనకు ఎందుకు దూరం అయ్యాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ విషయం ఏంటి అంటే…జనసేనలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని కొన్ని విషయాలు పవన్ కి మింగుడుపడడం లేదట.
ఇప్పటికే పవన్ కోటరీలో ఒకరంటే ఒకరికి పీకల్లోతు కోపం ఉంది.ఈ సమయంలోనే… పార్టీలోకి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రావడం…ఆయనకు పవన్ విపరీతమైన ప్రేయార్టీ ఇవ్వడం మిగిలిన నాయకులకు అస్సలు నచ్చడం లేదు.
ఇప్పటికే ఆ పార్టీ కీలక నాయకుడు తోట చంద్ర శేఖర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు అనే వార్తలు కొద్ది రోజుల క్రితమే వచ్చాయి.

ఈ నేపథ్యంలో నాదెండ్ల పార్టీలో చేరడం… మిగతా నాయకులకు ప్రాధాన్యత తగ్గింది.మారిశెట్టి రాఘవయ్య దగ్గర్నుంచి పలువురు సీనియర్ నాయకులు ఉన్నాము అన్న పేరుకే పార్టీలో ఉన్నట్టు కనిపిస్తోంది.ఇటువంటి సమయంలో పవన్ యాత్రల సంగతి కాస్త పక్కనపెట్టి పార్టీలో జరుగుతున్న ఈ అసంతృప్తులపైనా దృష్టిసారిస్తే మంచిది అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది.








