తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఓటమి తరువాత బీజేపీలో మార్పు వచ్చిందా ? గెలుపైనా ఓటమైనా ఇకపై సింగిల్ గానే బరిలోకి దిగాలని భావిస్తోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనపార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు.20-30 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న కమలనాథులకు ఊహించని విధంగా కేవలం 8 సిట్లే లభించాయి.ఇక మిత్రపక్షంగా పోటీ చేసిన జనసేన పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించకపోగా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి.
![Telugu Janasena, Kishan Reddy, Pawan Kalyan, Tdp-Politics Telugu Janasena, Kishan Reddy, Pawan Kalyan, Tdp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Janasena-Telangana-assembly-election-bjp-tdp-party-Kishan-Reddy-Pawan-Kalyan.jpg)
దీంతో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ తప్పు చేసిందా అనే సందేహాలు గట్టిగానే వ్యక్తమయ్యాయి.ఎందుకంటే మొదట్లో సింగిల్ గానే బరిలోకి దిగాలని భావించినప్పటికి అనూహ్యంగా జనసేన పార్టీతో కలిసి పోటీ చేసింది.ఈ పొత్తు వల్ల బీజేపీని నష్టమే తప్పా లాభం లేకపోవడంతో ఇక రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.
![Telugu Janasena, Kishan Reddy, Pawan Kalyan, Tdp-Politics Telugu Janasena, Kishan Reddy, Pawan Kalyan, Tdp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Janasena-Telangana-assembly-election-bjp-tdp-Kishan-Reddy-Pawan-Kalyan.jpg)
దీన్ని బట్టి చూస్తే జనసేన పార్టీతో పొత్తును తెలంగాణలో తెగతెంపులు చేసుకున్నట్లేనని అర్థమౌతోంది.అయితే ఎన్డీయేలో సభ్యత్వం ఉన్న జనసేన పార్టీ ఏపీలో టీడీపీ మరియు బీజేపీ ( BJP )రెండు పార్టీలతో పొత్తులో ఉంది.ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు పార్టీల మద్య పొత్తు తెగతెంపులు కావడంతో ఏపీలో కూడా బీజేపీ జనసేన మద్య దూరం పెరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.ఎందుకంటే ఏపీలో బీజేపీ కంటే టీడీపీకే ఎక్కువ ప్రదాన్యత ఇస్తున్నారు పవన్ కల్యాణ్( Pawan Kalyan ).దాంతో జనసేనతో పొత్తులో ఉన్నా.టీడీపీ( TDP )కే లాభం చేకూరుతుందనే అభిప్రాయం కాషాయ నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే వ్యూహాత్మకంగా జనసేన పార్టీని దూరం పెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నామాట.