ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ ప్రభావం అందరూ చవి చూసారు.ఫస్టవేవ్.
సెకండ్ వేవ్.ధర్డ్ వేవ్ ఇలా వరుసబెట్టి నానా హంగామా చేసిన విషయం విధితమే.
ఇప్పుడిప్పుడే కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలు కోలుకుంటున్నారు.ఇదే సమయంలో కరోనా మరోసారి ప్రతాపం చూపుతోంది.
ఇంకా ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉందని, స్వల్ప విరామం తరువాత వైరస్ కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
ఎందుకంటే కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోందని హెచ్చరించింది.తాజాగా చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధృతి పెరుగుతోంది.
ఈనేపథ్యంలోనే డబ్య్లూహెచ్ఓ ఎపిడెమిలాజిస్ట్ మరియా వాన్ ఖెర్ఖవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలు కోవిడ్ మహమ్మారి అంతమవుతుందా ? మరింత తీవ్ర రూపం దాల్చుతుందా ? అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది.దీనిని పక్కన బెడితే ప్రస్తుత పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలని అన్నారు.ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇంకా అధికంగా ఉందని, ఇటీవల కొన్ని వారాల పాటు తగ్గుముఖం పట్టినా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని చెప్పారు.
కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ కేసులు పెరుగుతున్నాయంటూ వెల్లడించారు.మార్చి 7-13 మధ్య వరల్డ్ వైడ్‌గా కొత్తగా కోవిడ్ కేసులు 8శాతం పెరిగాయి.ఇందులో అత్యధికంగా దక్షిణ కొరియా, వియత్నాం, జర్మనీ దేశాల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు.అయితే వ్యాక్సినేషన్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఎత్తేశారని, ఈ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

వ్యాక్సిన్‌ల వల్ల కరోనా వైరస్ తీవ్రత ప్రాణాపాయ ముప్పు తగ్గుతుందే తప్ప వైరస్ వ్యాప్తి తగ్గబోదని డబ్య్లహెచ్ఓ వెల్లడించింది.ఇది దేశాలను బట్టి మారుతోందని, ప్రపంచమంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.అయితే చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తున్నదని, ఇది అన్ని దేశాలకు సంకేతంగా భావించొచ్చు.దీంతో చైనాలో లాక్ డౌన్ విధించారు.ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ విజృంభించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.మొత్తంగా మరోసారి ప్రజలకు కరోనా ముప్పు తప్పేట్లు లేదని తెలుస్తోంది.