ప్రస్తుతం టాలీవుడ్ లో ఎటు చుసిన రాజమౌళి చుట్టూ, ఆర్ ఆర్ ఆర్ చుట్టూ వివాదం నడుస్తూ ఉంది, మన తెలుగు సినిమా ఆస్కార్ వస్తుందో రాదో తెలియదు కానీ దాని గురించిన రగడ మాత్రం టాలీవుడ్ లో విపరీతంగా జరుగుతుంది.కేవలం ఆస్కార్ కోసమే రాజమౌళి నిర్మాత వద్దు అన్నకూడా వినకుండా 80 కోట్లు ఖర్చు పెట్టాడని మొదటి నుంచి వార్తలు వస్తున్న నేపథ్యం లో ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్ 80 కోట్లు ఒక అవార్డు కోసం ఖర్చు పెట్టడం కన్నా 8 సినిమాలు తీసి మొహం మీద కొట్టేవాణ్ణి అంటూ వ్యాఖ్యలు చేయడం తో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది.

ఇక ఆ వ్యాఖ్యలు వైరా అవుతుండటం తో అందుకు ఫుల్ స్టాప్ పెట్టాలని టాలీవుడ్ పెద్దలు పూనుకున్నారు.అందుకోసమే కౌంటర్ అటాక్ ప్రారంభించారు, నాగ బాబు, రాఘవేంద్ర రావు లాంటి సెలెబ్రిటీ లు ఎదురు దాడి చేస్తుండటం తో రాజకీయంగా కూడా ఇందులో ఒక కోణం ఉందంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి, మరో వైపు ఎంత ఖర్చు పెట్టాము, ఏమి తెచ్చాము అనే విషయం ఆలోచిస్తే రాజమౌళి సినిమా కేవలం ఒక కాటగిరీలోనే నామినేట్ అయ్యింది.అక్కడ మిస్ అయితే ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ వచ్చే ఆస్కారమే లేదు.మరి ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి సినిమాకు ఆస్కార్ రాకపోతే రాజమౌళి వివాదాల పాలయ్యే అవకాశం ఉంది.
అంత తుస్సుమన్నట్టు టాలీవుడ్ రాజమౌళితో ని విమర్శించే అవకాశం లేకపోలేదు.

మరో వైపు తమ్మారెడ్డి లాంటి వ్యక్తి ఇప్పటికే రాజమౌళి ఆస్కార్ కోసం పెడుతున్న ఖర్చు చూసి ఓర్వలేక భిన్నమైన వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం.మరి ఆస్కార్ కూడా రాకపోతే మరోసారి అలంటి వారి తమ నోటికి పని చెప్పకుండా ఉంటారా అనేది పెద్ద ప్రశ్న.ఇలా ఇన్ని విషయాల వల్ల రాజమౌళి ఒకింత ప్రెజర్ ఫీల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది.
సినిమా తీయడం ఒక పని అయితే హిట్ అయ్యి కోట్లు కొల్లగొట్టిన కూడా ఇలా ఒక అవార్డు మూలంగా ఇన్ని వివాదాలు రావడం అనేది నిజంగా శోచనీయం.ప్రతిభను గుర్తించడానికి ఎన్ని గండాలు దాటాలో మరి .!
.