హలో లేడీస్.. నెలసరిలో కాఫీ వద్దే వద్దు..!

కాఫీ( Coffee ).ఈ పేరు వింటే చాలు కొందరికి నరనరాల్లో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి.

ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులు కోట్లలో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ కడుపులోకి వెళ్లకపోతే ఆగమాగం అయిపోతుంటారు.

ప్రస్తుత రోజుల్లో ఎంతో మందికి కాఫీ అనేది ఒక ఎడిక్షన్ అయిపోయింది.కాఫీ తాగకపోతే రోజు కూడా గడవదు అన్నట్లుగా దానికి అలవాటు పడిపోయారు.

అయితే కాఫీలో కెఫిన్ ఉంటుంది.కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం ప్రాణాంతకం.

Advertisement

శ‌రీర‌రంలోకి కెఫిన్( Caffeine ) అధికంగా వెళ్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆందోళన, క్రమరహిత హృదయ స్పందన, వికారం, వాంతులు, తల తిరగడం, అతిసారం, మూర్ఛ, కండరాలు మెలితిప్పడం, దాహం త‌దిత‌ర స‌మ‌స్య‌లు తలెత్తాయి.అందుకే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కాఫీని చాలా లిమిట్ గా తాగాలి.

పరిమితంగా తీసుకుంటే కాఫీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.ఇకపోతే ఆడవారిని నెలసరి సమయంలో కాఫీ తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

నెలసరి ( periods ) లో కాఫీ సరైన ఎంపిక కాదని చెబుతున్నారు.పైన చెప్పినట్లుగా కాఫీలో కెఫిన్ ఉంటుంది.ఇది రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తుంది.

పీరియడ్స్ టైమ్‌ లో ఆడవారు కాఫీ తాగడం వల్ల గర్భాశయానికి వెళ్లే రక్తనాళం ఇరుకుగా మారుతుంది.దాంతో నెలసరి నొప్పి చాలా అధికంగా ఉంటుంది.

రోజు నైట్ ఈ రోజ్ సీరం ను వాడితే మీ స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవడం గ్యారంటీ!
Indigestion : నిత్యం అజీర్తితో బాధపడుతున్నారా.. మందులతో పని లేకుండా ఇలా పరిష్కరించుకోండి!

అంతేకాదు కెఫిన్ పీరియడ్స్ సమయంలో తిమ్మిరిని మరింత తీవ్రతరం చేస్తుంది.కడుపు ఉబ్బరాన్ని మరియు అసౌకర్యాన్ని సైతం కలిగిస్తుంది.

Advertisement

కాబట్టి నెలసరి సమయంలో వీలైనంతవరకు కాఫీని అవాయిడ్ చేయండి.

అలాగే నెలసరిలో కాఫీ తో పాటు శీతల పానీయాలు కూడా తాగొద్దని నిపుణులు చెబుతున్నారు.ఇవి శరీరంలో నీటి నిల్వలను పెంచడమే కాకుండా నెలసరి నొప్పులు అధికం చేస్తాయి.నెలసరి సాఫీగా సాగాలంటే మంచి డైట్ ని ఎంచుకోండి.

ఆ టైంలో స్పైసీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్( Spicy foods, fatty foods ) ను దూరం పెట్టండి.లైట్ ఫుడ్ తీసుకోండి.ఉప్పు వాడకం బాగా తగ్గించండి.

కచ్చితంగా నెలసరి టైంలో ఏదో ఒక హెర్బల్ టీ తీసుకోండి.హెర్బల్ టీలు నెలసరి నొప్పులు దూరం చేయడానికి చాలా అద్భుతంగా తోడ్పడతాయి.

తాజా వార్తలు