మానవ శరీరంలో పొటాషియం తగ్గితే ఏమవుతుంది.. పొటాషియం లభించే ఆహార పదార్థాలు ఇవే..?

ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న ప్రజలు ఏ చిన్న పని చేసిన త్వరగా అలసిపోతూ ఉంటారు.

అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే మానవ శరీరంలో పొటాషియం( Potassium ) తగ్గితే బలహీనత, అలసటలు వస్తాయి.కండరాల తిమ్మిరి కూడా వస్తుంది.

అలాగే గుండె కొట్టుకోవడం అసాధారణంగా ఉంటుంది.కాబట్టి శరీరంలో పొటాషియం తగ్గకుండా చూసుకోవడం ఎంతో మంచిది.

పొటాషియం లోపిస్తే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

What Happens If Potassium Decreases In The Human Body These Are The Food Items T
Advertisement
What Happens If Potassium Decreases In The Human Body These Are The Food Items T

ముఖ్యంగా చెప్పాలంటే వైట్ బీన్స్( White beans ) లో పొటాషియం ఎక్కువ గా ఉంటుంది.అలాగే అరకప్పు వైట్ బీన్స్ లో 421 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.అలాగే చిలకడ దుంప కూడా పొటాషియం నిల్వలు ఉన్న ఉత్తమమైన ఆహారాలలో ఒకటి.

దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరంలో పొటాషియం తగ్గకుండా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే బచ్చలి కూర( Spinach ) లో కూడా పొటాషియం ఉంటుంది.

ఇందులో కప్పుకు 839 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.

What Happens If Potassium Decreases In The Human Body These Are The Food Items T

ముఖ్యంగా చెప్పాలంటే టమాటో( Tomato ) ఉత్పత్తులు, టమాటో సాస్ వంటి వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.అలాగే పండ్లలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది.ఒక అరటి పండులో 451 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఇది మానవ శరీరంలోని అలసటను దూరం చేస్తుంది.అలాగే ఇది ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

Advertisement

ఇంకా చెప్పాలంటే 150 గ్రాముల అవకాడో ( Avocado )లో 1120 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.ఇది మానవ శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే కొబ్బరి నీరు తీపి వగరు, తక్కువ చక్కెర, ఎలక్ట్రోలైట్స్ లలో ఎక్కువగా ఉంటుంది.ఈ పొటాషియం ఉన్న ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని అలసట, నిరసం దూరమైపోతాయి.

తాజా వార్తలు