ఆ హీరోతో ఏం కాలేదు.. ఆహా వాళ్ళు అలా చేయమన్నారు: పునర్నవి

ఉయ్యాల జంపాల సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పునర్నవి భూపాలం తర్వాత బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి, రాహుల్ మధ్య ప్రేమ ప్రయాణం మొదలైందని తీవ్రస్థాయిలో వార్తలు వినిపించాయి.

ఆ వార్తలకు తగ్గట్టుగానే వీరిద్దరూ హౌస్ లో చేసిన రొమాన్స్ నిజమేనని భావించాయి.అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన కొద్ది రోజుల వరకు ఎంతో చనువుగా ఉన్న ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు.

బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న పునర్నవి వెబ్ సిరీస్ లలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా పునర్నవి ఎంగేజ్మెంట్ రింగ్ గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలోనే చర్చలు జరిగాయి.

ఈ విషయంపై నెటిజన్లు స్పందించి కామెంట్లు పెట్టడం చేశారు.అయితే తాజాగా పునర్నవి ఈ విషయం గురించి మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు.

Advertisement

రీసెంట్ గా పునర్నవి వేలుకు రింగ్ పెట్టుకొని అయిపోయింది అంతా అయిపోయిందా అంటూ వేలికి ఉంగరం పెట్టుకొని ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ షేర్ చేయడంతో నిజంగానే ఈమెకు పెళ్లి ఫిక్స్ అయిందని నెటిజన్లు భావించారు.కానీ కొంతమంది మాత్రం ఇదేదో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఉంటుందని భావించారు.ఈ విషయంపై పునర్నవి మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోవడం లేదని, పెళ్లికి ఇంకా చాలా టైం ఉందని తెలియజేస్తూ అసలు విషయం చెప్పారు.

పునర్నవి కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్ ఫిలిం ప్రమోషన్ లో భాగంగా ఈ విధంగా తన వేలికి ఉంగరం పెట్టుకున్న ఫోటోను ఇన్స్టాల్ లో షేర్ చేశారు.పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పునర్నవి సరసన ఉద్భవ్ రఘునందన్ నటించారు.

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో విడులైంది.ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా ఆహా టీం వాళ్ళు అలా చేయమంటే చేశామని ఈ సందర్భంగా పునర్నవి తెలిపారు.

ఈ విధంగా పోస్ట్ చేయడం ద్వారా ఎన్నో కామెంట్స్ వస్తాయని నేను ముందుగానే భావించినట్లు తెలిపారు.సాధారణంగా మా సినిమా వస్తుంది చూడండి అంటే రొటీన్ గా అనిపిస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాబట్టి, మా సినిమాను జనంలోకి తీసుకు వెళ్లాలంటే కొత్త వేలో ప్రమోట్ చేయాలని ఆలోచించడం వల్ల ఈ విధంగా ఆహా టీం వాళ్ళు చెప్తేనే చేశామని పునర్నవి తెలియజేశారు.ఇలాంటి ప్రమోషన్స్ చేయగా, ఎలాంటి కామెంట్స్ వస్తాయో నేను ముందుగానే ప్రిపేర్ అయ్యానని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు