సమంత… టాలీవుడ్ లో ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే ఆమె నటించిన సినిమాలే కారణం.విడాకుల తర్వాత కొన్నాళ్లపాటు మీడియాలో బాగా పాపులర్ అయినా సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించడం లేదు.
ఆమె ఏం చేసినా కూడా కాంట్రవర్సీ అవుతుండడం తో అమే కొంచం సైలెంట్ గా ఉంటుంది.మరోవైపు ఆమెను ఆరోగ్య సమస్యలు సైతం సతమతం చేస్తున్నాయని తెలుస్తోంది.
ఆమె స్కిన్ కి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అమెరికాలో ఉన్నట్టుగా కూడా మొన్న ఈ మధ్య వార్తలు వచ్చాయి.కానీ ఉన్నట్టుండి కోయంబత్తూర్ ఆశ్రమంలో ఉన్న ఫోటోలు సైతం బయటకు వచ్చాయి.
ఇక అమే ప్రస్తుతం శకుంతల మరియు యశోద సినిమాలో నటిస్తుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏంటో తెలియని పరిస్థితి ఉంది.ఇక సమంత ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఆమె నటన బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆమె గొంతు కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
ఆమె హస్కీ వాయిస్ తో చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసాయి.తొలి సినిమా నుంచి ఆమెకు సింగర్ చిన్మయి గాత్రదానం చేస్తూ వస్తోంది.
ప్రతి సినిమాలోని చిన్మయితోనే డబ్బింగ్ చెప్పించేవారు సినిమా యూనిట్ సైతం.కానీ ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ మహానటి సినిమా తర్వాత తన డబ్బింగ్ తానే చెప్పుకోవాలని డిసైడ్ అయిన సమంత అప్పటినుంచి సొంతంగా డబ్బుని చెప్పుకోవడం మొదలుపెట్టింది.
అంతకుముందు ఆమె గొంతుకు ఎంతో అభిమానం ఉండేవారు.కానీ మహానటి నుంచి పెద్దగా ఆమె వాయిస్ పై ఎలాంటి మార్కులు పడ్డట్టుగా కనిపించడం లేదు.మరి సమంతకి, సింగర్ చిన్మయికి మధ్యలో ఏమైనా విభేదాలు వచ్చాయా అనే కోణంలో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వీరిద్దరి మధ్య చాలా రోజులుగా గ్యాప్ కనిపిస్తుంది.అయితే శకుంతలం సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో సింగర్ చిన్మయి చేత డబ్బింగ్ చెప్పించాలని సినిమా యూనిట్ పట్టుబడుతున్నట్టుగా సమాచారం, అందుకు సమంతా ఒప్పుకోవడం లేదట.
దాని వెనక కారణం ఏమై ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.ఏది ఏమైనా ఇంత పెద్ద ప్రాజెక్టులో సమంత చిన్మయి చేత డబ్బును చెప్పించకపోవడానికి గల కారణాలను వెతుకునే పనిలో పడ్డారు నటిజన్స్.