ట్రంప్ గారాల కూతురు ఇవాంకా ట్రంప్ ను వైట్ హౌజ్ కమిటీ సుదీర్ఘ విచారణ చేసింది.దాదాపు 8 గంటల పాటు విచారించిన కమిటీ ఇవాంకా నుంచీ కీలక సమాచారం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇంతకీ అసలు ఇవాంకా ట్రంప్ పై విచారణ ఎందుకంటే.అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన ఏనాడు జరగని ఘటన క్యాపిటల్ హిల్ పై దాడి.
అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునే క్రమంలో తుది ఆమోదం పొందుతున్న తరుణంలో పెద్ద ఎత్తున ట్రంప్ మద్దతు దారులు క్యాపిటల్ హిల్ పై దాడి చేశారు.ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఓడిపోవడంతో తనకు అన్యాయం జరిగిందని ఓటింగ్ లెక్కింపులో తేడాలు జరిగాయంటూ కోర్టులను ఆశ్రయించిన ట్రంప్ కు కోర్టులు కూడా షాక్ ఇచ్చాయి.ఈ వ్యవహారంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ కేసులు కొట్టేసాయి.
దాంతో ట్రంప్ భారీగా తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరిని ఉగ్రవాదులుగా మార్చేసింది.దాంతో రెచ్చిపోయిన మద్దతు దారులు అమెరికా క్యాపిటల్ భవనం పై చేయడంతో పోలీసులు అధికారులు మృతి చెందడంతో పాటు, ఇద్దరు ఆందోళన కారులు కూడా మృతి చెందారు.ఈ క్రమంలో నే

బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే క్యాపిటల్ హిల్ దాడి ఘటనపై విచారణా కమిటీ వేసి దోషులను శిక్షించాలని ఆదేశించారు.ఇప్పటికే దాడికి సంభందించి పలువురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అప్పట్లో వైట్ హౌస్ అడ్వైజర్ గా ఉన్న ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ ని హౌజ్ కమిటీ విచారణకు పిలిచింది.దాడి సమయంలో ఇవాంకా తన తండ్రితో క్యాపిటల్ భవనంపై దాడిని అడ్డుకోవాలని కోరినట్టుగా హౌజ్ కమిటీ వద్ద ఆధారాలు ఉండటంతో ఇవాంకాను విచారణకు పిలిపించినట్టుగా హౌజ్ కమిటి వెల్లడించింది.సుమారు 8 గంటల పాటు జరిగిన సుదీర్ఘ విచారణలో ఇవాంకా పలు కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది.







