మణిపూర్ అల్లర్ల( Manipur violence ) పై పార్లమెంట్ లోని ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి.దీనిపై నిష్పక్షపాతమైన చర్చ జరగాలని, ప్రధాన మోడీ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలు ఉభయ సభలను స్తంభింప చేస్తున్నాయి.
అయితే చర్చకు అంగీకరించిన అధికారపక్షం మోడీ ప్రకటన డిమాండ్ పై మాత్రం ఇంతవరకు స్పందించలేదు .ఇక చివరి అస్త్రం గా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగించాలని ప్రతిపక్షాలు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.నిజానికి భాజపాకు లోక్సభలో 301 సభ్యుల బలం ఉంది.ఎన్డిఏ మిత్ర పక్షాలతో కలుపుకుంటే ఆ సంఖ్య 335 వరకు చేరుతుంది.

మరి అంత బలంగా ఉన్న భాజాపాపై అవిశ్వాసుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి విపక్ష సభ్యులు సాధించేది ఏమిటి అంటే మోడీ( Narendra Modi ) స్పందన ని అన్న సమాధానం వస్తుంది .నిజానికి తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో జరిగే అక్రమాలపై అమానుష సంఘటనలపై మోడీ మౌనం వహిస్తారని, అదే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో జరిగే విషయాలను మాత్రం భూతద్దంలో చూపి నానా యాగి చేస్తారని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తూ ఉంటాయి .దానిని బలపరిచే విదంగానే మణిపూర్ ఘటన పై ఇంతవరకు ప్రదాని మోడీ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు .ఇది దేశం సిగ్గుపడాల్సిన సంఘటన అని మీడియా లో ప్రకటించి ఊరుకున్నారే తప్ప నిందితులపై తీసుకుంటున్న చర్యలపై గాని అక్కడ ప్రజలను ఉద్దేశించి గాని మోడీ సరైన విధంగా స్పందించలేదన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.

అంతేకాకుండా ఘటన జరిగి మూడు నెలలు అవుతున్నా హోం శాఖకు దీనిపై స్పష్టమైన సమాచారం ఉన్న కూడా అది మిగతా ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారే తప్ప అక్కడ పరిస్థితిని మీడియాకు కూడా చెప్పకపోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగే చర్చలో ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉందని అప్పుడు ప్రధానిహోదాలో మోడీ స్పష్టమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంపై మోదీని నిలదీయడానికే అవిశ్వాస తీర్మానం తప్ప బలంగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అవిశ్వాసం సాధించేది ఏమీ ఉండదు.అయితే ప్రజాస్వామ్యంలో జవాబుదారీగా ఉండాల్సిన అధికార పక్షాలు మౌనంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఇలాంటి ప్రయత్నాలు తప్పవేమో అనిపిస్తుంది.







