2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పోకిరి సినిమా ఎంత సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.మహేష్ బాబు, ఇలియానా కలిసి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకొని రికార్డుకెక్కింది.
ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, ఆలీ, నాజర్ వంటి పలువురు నటీ నటులు నటించారు.
ఈ సినిమాలోని డైలాగులు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇందులో పాటలు కూడా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నాయి.ఇక ఈ సినిమా తెలుగులో హిట్ అవడంతో ఇతర భాషలలో కూడా రీమేక్ గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించిన హాట్ బ్యూటీ జ్యోతి రానా.
ఈ ముద్దుగుమ్మకు శివా రానా అనే మరో పేరు కూడా ఉంది.
ఇక ఈ బ్యూటీ పోకిరి సినిమాలో తన పాత్రతో మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.
కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా ఎదగలేకపోయింది.బహుశా మొదటి సినిమాకే విలన్ గా కనిపించడం వల్ల తనకు అవకాశాలు రాలేదేమో అని తెలుస్తుంది.
దాంతో ఈ హాట్ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో ద్వారా మాత్రం ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అంతే కాకుండా ఈ బ్యూటీ తీయించుకునే ఫోటో షూట్ లు చూస్తే మాత్రం మతి పోకుండా ఉండదు.ఎందుకంటే తన ఎద అందాలతో, నడుము అందాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రాలను కన్నార్పకుండా చేస్తుంది.
పైగా ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా క్షణాలో ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి.అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపించి షాక్ ఇస్తుంది.
ఇక జ్యోతి రానాకు దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది.అప్పుడప్పుడు దైవంకి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటుంది.

ఇక ఈ హాట్ బ్యూటీ బాగా టూర్స్ అంటూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.వాటికి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.నిత్యం ఏదో ఒక ఫోటోను మాత్రం కచ్చితంగా వదులుతూ ఉంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలలో అవకాశాలు అందుకోకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్ లో ఉంటూ తన ఫోటో షూట్ లతో మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది.
ఇక సినిమాలకు దూరంగా ఉన్న ఈ హాట్ బ్యూటీ మళ్లీ తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.







