ప్రచారంపై పవన్ మౌనం దేనికి సంకేతం?

తెలంగాణ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ఘనంగా ప్రకటించినా ఆ తర్వాత బిజెపి ఏంటర్ అవ్వడంతో తప్పనిసరి పరిస్తితి లో తమ స్థానాలను నాలుగోవంతుకు కుదించుకున్న జనసేన ఇప్పుడు వాటిలో కనీసం ఒకటి రెండు స్థానాలలైనా గెలవడానికి శ్రమిస్తుంది.

కూకట్పల్లి ఖమ్మం వంటి నియోజకవర్గాలలో జనసేనకు ఎంతో కొంత అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న దరిమిలా అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే అది గెలుపుకు ఉపయోగపడుతుందని అంచనాలో జనసేన( Janasena ) శ్రేణులు ఉన్నాయి.

పవన్ కచ్చితం గా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని ఆయా నాయకులు చెబుతున్నా ఇప్పటివరకు పవన్ ప్రచారానికి సిద్ధమైన దాఖలాలు అయితే లేవు.

What Does Pawans Silence On The Campaign Mean , Pawan Kalyan , Campaign , Yc

అయితే పవన్( Pawan Kalyan ) ప్రచారం చేయకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారు అన్న ప్రశ్నలకు ఇంతవరకూ సమాధానం లేదు.అయితే వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ఎనిమిది స్థానాల్లో మాత్రమే ప్రచారం చేసి ఊరుకుంటే బీజేపీ అభ్యర్థులు ఊరుకోరని, తమ తమ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయాలని పట్టు పడతారని, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి అభ్యర్థులు అనుకూలంగా పవన్ ప్రచారం చేయాల్సిన ఒత్తిడిలోకి నెట్టి వేయబడతారని తద్వారా అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటుందని ఇది భవిష్యత్తు సమీకరణాల రీత్యా కొత్త సమస్యలు తీసుకొస్తుందన్న ఉద్దేశంతోనే పవన్ మౌనవహిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.మరోపక్క ఆంధ్రప్రదేశ్లో పొత్తుపై బీజేపీ( BJP ) నుంచి ఇంకా స్పష్టమైన సంకేతాలు రాకపోవడం వల్ల తెలంగాణలో అవసరానికి మించి మద్దతు ఇవ్వటం అనవసరమనే ముందు చూపుతోనే పవన్ వెనుకకు తగ్గారని మరో వర్గం విశ్లేషిస్తుంది.

What Does Pawans Silence On The Campaign Mean , Pawan Kalyan , Campaign , Yc

ఏది ఏమైనా తమ పార్టీ నైతిక ధైర్యం పెరిగి ఒకటి రెండు స్థానాలు గెలుచుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రభావం చూపి అవకాశం ఉంది పోటీ చేసి ఇలా వెనకకు తగ్గినట్లుగా వ్యవహరిస్తే మాత్రం అసలుకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని కూడా జనసేన కేడర్ భయపడుతుంది.మరి పవన్ మనసులో ఏముందో మాత్రం ఇంతవరకు బయట పెట్టలేదు.ఎన్నికల రోజు దగ్గరకొస్తున్నా కూడా ప్రచార సరళి పై ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాకపోవడం మాత్రం జనసేనకులను ఇబ్బంది పడుతుందని తెలుస్తుంది.

Advertisement
What Does Pawans Silence On The Campaign Mean , Pawan Kalyan , Campaign , YC
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు