బుల్లితెరపై మంచి ప్రేక్షకదారణతో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు అభిమాన సీరియల్ గా మారింది.
సెలబ్రెటీలు సైతం ఈ సీరియల్ కు ఎంతలా వాలిపోయారో చూసాం.
ఇక ఈ సీరియల్ మొదటి నుండి ఒకే కథతో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయినా కూడా రేటింగ్ లో మాత్రం ఈ సీరియల్ ని మించిన మరో సీరియల్ లేదని చెప్పాలి.అంతేకాకుండా ఏ స్టార్ హీరోల సినిమాలు వచ్చినా కూడా ఈ సీరియల్ కంటే ఎక్కువ రేటింగ్ సొంతం చేసుకోలేకపోయాయి.
ఎందుకంటే ఈ సీరియల్ కు అంత క్రేజ్ ఉందన్న మాట.ఇక ఇందులో నటించిన డాక్టర్ బాబు, వంటలక్క, సౌందర్య, మోనిత పాత్రలకు బాగా ఆకర్షితులయ్యారు అభిమానులు.ఇక గత కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్ రేటింగ్ బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే.కారణం ఈ సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు చనిపోయిన తర్వాత చిన్న పాత్రలు పెద్దవారిగా మారిన సంగతి తెలిసిందే.
దీంతో ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు లేకపోయేసరికి ఈ సీరియల్ మొత్తం డీలాపడింది.దీంతో దర్శకనిర్మాతాలు ఈ సీరియల్ రేటింగ్ పడిపోవటంతో మళ్ళీ చనిపోయిన వంటలక్కను, డాక్టర్ బాబును బతికివచ్చినట్లు తీసుకువచ్చి మళ్ళీ మునుపటి రేటింగు సొంతం చేసుకోవాలని చూసాడు.

అన్నట్టుగానే వంటలక్క, డాక్టర్ బాబుల ఎపిసోడ్ రాగానే రేటింగ్ బాగానే దూసుకు వచ్చింది.ఇక వీరిద్దరు బతికున్నాక మోనిత ఏం పాపం చేసిందని అనుకున్నారో ఏమో.వెంటనే ఆమెను కూడా రంగంలోకి దింపారు.ఇంకేముంది మళ్లీ సీరియల్ మొదటికి వచ్చేసింది.
పైగా అదే కథని మళ్లీ ప్రేక్షకులకు చూపించి పిచ్చోళ్ళని చేస్తున్నారు.
ఎప్పుడు ఇదే కథనా అంటూ.
కనీసం కథని మార్చి కొత్తగా చూపించండి అంటూ బాగా వేడుకుంటున్నారు.ఇక ప్రతివారం అలాగే సాగ తీయడంతో జనాలు ఈ సీరియల్ ని చూడటం దూరం పెట్టేశారు.
ఇక మునుపటి కథనే తీసుకొచ్చారు అంటూ.మీ రేటింగ్ కోసం మమ్మల్ని ఇంకా ఇదే కథతో వేధిస్తున్నారు అంటూ దారుణంగా తిట్టిపోస్తున్నారు.
పైగా ఏ కథతో వచ్చినా కూడా చూస్తూ ఉండిపోతారు అనుకుంటున్నారు అని అంటున్నారు.దీంతో సగానికి సగం మంది ఇక ఈ సీరియల్ మళ్ళీ అదే కదా అని.అదే బోరింగ్ అంటూ చూడటమే తగ్గించేశారు.పైగా రేటింగ్ కూడా పూర్తిగా తగ్గిపోయింది.
ఇక ఈ సీరియల్ కు పోటీగా గుప్పెడంత మనసు దూసుకు వస్తుంది.
ఒకప్పుడు కార్తీకదీపం కు ఇతర సీరియల్స్ కు రేటింగ్ లో చాలా గ్యాప్ ఉండేది.
కానీ ఇప్పుడు అలా లేదు.చాలావరకు కార్తీకదీపం దగ్గరికి ఇతర సీరియల్స్ పోటీగా వచ్చేసాయి.
ఇంకేముంది ఇదే కథతో కొనసాగిస్తే కొన్ని రోజులైతే ఆ రేటింగ్ కూడా వెళ్ళిపోతుందని చెప్పవచ్చు.మరి ఇప్పటికైనా కథను మారుస్తారో లేదో చూడాలి.